AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Long Hair Tips: పట్టుకుచ్చుల్లా మెరిసిపోయే కురులు కావాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి..

ఆడవారికైనా.. మగవారికైనా జుట్టుంటేనే అందం. పట్టుకుచ్చుల్లా మెరిసిపోయే.. నల్లటి నిగనిగలాడే కురులుంటే నలుగురిలో ఉండే ఆ ప్రత్యేకతే వేరుగా ఉంటుంది. ఎదుటి వారిని ఆకర్షించడమే కాకుండా..

Long Hair Tips: పట్టుకుచ్చుల్లా మెరిసిపోయే కురులు కావాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి..
Hair Care
Sanjay Kasula
|

Updated on: Jan 26, 2022 | 3:48 PM

Share

Oil For Long Hair: ఆడవారికైనా.. మగవారికైనా జుట్టుంటేనే అందం. పట్టుకుచ్చుల్లా మెరిసిపోయే.. నల్లటి నిగనిగలాడే కురులుంటే నలుగురిలో ఉండే ఆ ప్రత్యేకతే వేరుగా ఉంటుంది. ఎదుటి వారిని ఆకర్షించడమే కాకుండా మనల్ని ప్రత్యేక వ్యక్తులుగా నిలబెడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.పొడవాటి, ఆరోగ్యకరమైన జుట్టు ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. నిగనిగలాడే కురుల కోసం సులభమైన మార్గాలలో ఒకటి జుట్టు నూనెను ఉపయోగించడం. హెయిర్ ఆయిల్ ఆరోగ్యకరమైన జుట్టుకు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చాలా కాలంగా జుట్టు సంరక్షణ నియమావళిలో నూనెను పూయడం ఒక భాగం. జుట్టులో హెయిర్ ఆయిల్ అప్లై చేయడం అవసరం. అవి మీ స్కాల్ప్‌ను తేమగా మార్చడానికి, జుట్టు వేగంగా పెరిగేలా చేస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టు కోసం మీరు అనేక రకాల హెయిర్ ఆయిల్‌లను ఉపయోగించవచ్చు. ఇందులో కొబ్బరి నూనె, బాదం నూనె, ఆముదం, ఆలివ్ నూనె మొదలైనవి ఉన్నాయి.

పొడవాటి జుట్టు కోసం ఈ నూనెను ఉపయోగించండి 

కొబ్బరి నూనే

సాధారణంగా ఉపయోగించే నూనెలలో ఒకటి కొబ్బరి నూనె. ఇది జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. ఇది మీ స్కాల్ప్ హెల్తీగా , హెయిర్ ఫోలికల్స్ ను బలోపేతం చేసే న్యూరిషింగ్ గుణాలను కలిగి ఉంటుంది. కరివేపాకు, మెంతి గింజలు వంటి సహజ పదార్థాలను కలపడం ద్వారా కూడా కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు.

బాదం నూనె

బాదం నూనెలో కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు , ప్రోటీన్లు ఉన్నందున చర్మం, జుట్టు రెండింటికీ ఉత్తమ నూనెలలో ఒకటిగా పరిగణించబడుతుంది. బాదం నూనె మీ పొడి, దెబ్బతిన్న జుట్టును తేమ చేస్తుంది అలాగే జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. దీన్ని నేరుగా మీ జుట్టుకు అప్లై చేసి రాత్రంతా ఉంచుకోవచ్చు.

ఆముదము

ఈ నూనెలో విటమిన్ ఇ, మినరల్స్ , ప్రొటీన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఆముదం మీ జుట్టును చిక్కగా చేయడంలో.. జుట్టు పెరుగుదలను పెంచడంలో సహాయపడుతుంది. అంతే కాదు, చుండ్రు, పొడిబారడం మొదలైన మీ జుట్టుకు సంబంధించిన అనేక సాధారణ సమస్యలకు చికిత్స చేయడంలో కూడా ఆముదం సహాయపడుతుంది. కాస్టర్ ఆయిల్ స్థిరత్వంలో చాలా మందంగా ఉంటుంది. బాదం లేదా నువ్వుల నూనె వంటి ఏదైనా ఇతర నూనెతో దీనిని ఉపయోగించవచ్చు.

ఆలివ్ నూనె

ఆలివ్ నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది, ఇది తలకు పోషణనిస్తుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఆలివ్ ఆయిల్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్ మూలకం మన జుట్టుకు కండీషనర్‌గా పనిచేసి మృదువుగా చేస్తుంది. జుట్టు పాడైపోయి నిర్జీవంగా ఉన్న వ్యక్తులు. ఆలివ్ ఆయిల్ వారికి గొప్ప ఎంపిక.

ఇవి కూడా చదవండి: Mudragada-Ap CM: కొత్త జిల్లాలకు వీరి పేర్లు పెట్టండి.. సీఎం జగన్‌కు ముద్రగడ లేఖ..

Viral Video: ఇది బుజ్జి కుక్కల సీక్రెట్ మీటింగ్.. ఏం ప్లాన్ చేస్తున్నాయో తెలిస్తే..