Viral Video: ఇది బుజ్జి కుక్కల సీక్రెట్ మీటింగ్.. ఏం ప్లాన్ చేస్తున్నాయో తెలిస్తే..

ఇవాళ సోషల్ మీడియాలో ఓ ఫన్నీ వీడియో ఒకటి షేర్ చేయబడింది. మనం ఏదైన విషయంపై గ్రూప్ మీటింగ్ పెట్టుకుని ఆలోచిస్తుంటాం. మనం ఎలా మీటింగ్ పెట్టుకుని ఆలోచిస్తుంటామో అలానే..

Viral Video: ఇది బుజ్జి కుక్కల సీక్రెట్ మీటింగ్.. ఏం ప్లాన్ చేస్తున్నాయో తెలిస్తే..
Dog Secret Meeting
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 25, 2022 | 9:42 PM

మీరు సోషల్ మీడియా ప్రపంచంలో యాక్టివ్‌గా ఉంటే అక్కడ చాలా ఫన్నీ వీడియోలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. అయితే ఈ ఇవాళ సోషల్ మీడియాలో ఓ ఫన్నీ వీడియో ఒకటి షేర్ చేయబడింది. మనం ఏదైన విషయంపై గ్రూప్ మీటింగ్ పెట్టుకుని ఆలోచిస్తుంటాం. మనం ఎలా మీటింగ్ పెట్టుకుని ఆలోచిస్తుంటామో అలానే పశు, పక్షులు కూడా అప్పుడప్పుడు మీటింగ్ పెట్టుకుంటాయి. ఆ సమావేశాలను చాలా రహస్యంగా నిర్వహించుకుంటాయి. అలాంటి సమావేశం ఒకటి జరుగుతుండగా ఒకరు బ్రేక్ చేశారు. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో మూడు అందమైన కుక్కలు ప్లాస్టిక్ బాక్స్ కింద కూర్చుని తమలో తాము కబుర్లు చెప్పుకోవడం మీరు చూడవచ్చు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి ఆ ప్లాస్టిక్ ప్లాట్‌ఫారమ్‌ని ఎత్తి పక్కన పెట్టాడు. ఈ సమయంలో, వారి ఈ రహస్య సమావేశంకు బ్రేక్ పడింది. వెంటనే, మూడు కుక్కలు అమాయకంగా స్పందించడం కనిపిస్తుంది.

ఈ వీడియో చూడండి..

View this post on Instagram

A post shared by Pubity (@pubity)

ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతోంది. చాలా మంది యూజర్లు దీనిపై కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమాచారం వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్యూబిటీ అనే ఖాతా ద్వారా భాగస్వామ్యం చేయబడింది.

ఇవి కూడా చదవండి: Telangana Corona: తెలంగాణలో నైట్ కర్ఫ్యూపై కీలక ప్రకటన.. క్లారిటీ ఇచ్చిన హెల్త్ డైరెక్టర్..

UP Election 2022: సమాజ్‌వాదీ పార్టీకి మరో షాక్, బీజేపీలో చేరిన జలాల్‌పూర్ ఎమ్మెల్యే..