AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mudragada-Ap CM: కొత్త జిల్లాలకు వీరి పేర్లు పెట్టండి.. సీఎం జగన్‌కు ముద్రగడ లేఖ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham)మరో లేఖ రాశారు. సీఎం జగన్‌కు ఆయన లేఖలో ప్రస్తావించిన అంశాలు..

Mudragada-Ap CM: కొత్త జిల్లాలకు వీరి పేర్లు పెట్టండి.. సీఎం జగన్‌కు ముద్రగడ లేఖ..
Mudragada Cm Jagan
Sanjay Kasula
|

Updated on: Jan 26, 2022 | 3:14 PM

Share

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham)మరో లేఖ రాశారు. సీఎం జగన్‌కు ఆయన లేఖలో ప్రస్తావించిన అంశాలు ఆసక్తికరంగా మారాయి. ప్రభుత్వం జిల్లా పెంపు ప్రతిపాధన గురించి ప్రస్తావించారు. అయితే జిల్లాల పేర్లపై కొన్ని సూచనలు చేశారు. అందులో గోదావరి జిల్లాలో ఏదో ఒక జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు.. మరో జిల్లాకు శ్రీకృష్ణ దేవరాయలవారి పేరు పెట్టాలని కోరారు. దీంతోపాటు కోనసీమలోని జిల్లాకు లోక్ సభ స్పీకర్ స్వర్గీయ బాలాజీ గారి పేరు పెట్టాలని విన్నవించారు.

తన లేఖలో ఇలా రాశారు..”మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్పుకి తమరు శ్రీకారం చుట్టారని పత్రికలలో చూశానండి.. అంటూ పేర్కొన్నారు. నాదొక చిన్న మనవి దయచేసి అవకాశం ఉంటే మనసుపెట్టి పెద్దల పేర్లు పలు జిల్లాలకు పెట్టడానికి పరిశీలించమని కోరుచున్నాను. తూర్పు లేక పశ్చిమగోదావరిలో ఒక జిల్లాకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు.. ఏదో ఒక జిల్లాకి శ్రీకృష్ణదేవరాయలు పేరు పెట్టాలని.. కోనసీమకి లోక్ సభ స్పీకర్ స్వర్గీయ బాలాజీ గారి పేరు పెట్టాలని నా విన్నపం.” అంటూ లేఖలో పేర్కొన్నారు.

గత నాలుగు రోజుల క్రితం కూడా ఓటీఎస్‌‌పై లేఖ ద్వారా జగన్ సర్కార్‌ను ప్రశ్నించిన సంగతి తెలిసందే. ఓటీఎస్ పేరుతో పేదప్రజలపై ఒత్తిడి తేవద్దంటూ సీఎం జగన్‌ను కోరారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు వెంటనే చెల్లించాలని అడిగారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించని మీకు.. గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకు ఓటీఎస్ వసూలు అధికారం ఎక్కడిదని ముద్రగడ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:  Chiranjeevi: సినిమా తారలను వదలని మహమ్మారి.. మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్

Padma Shri: వైవిధ్యమైన ప్రాచీన కళ.. 12మెట్ల కిన్నెర రాగానికి పురస్కారం.. మొగిలయ్యను వరించిన పద్మశ్రీ