Health Tips: జామ ఆకుల టీ తో ప్రయోజనాలు తెలిస్తే.. మీరు రోజూ అదే తాగుతారు..
పాల టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, ఎల్లో టీ, లెమన్ టీ, అల్లంటీ ఇలా ఎన్నో రకాల టీలు ఉన్నాయి. ఈటీలతో కొన్ని రకాల ప్రయోజనాలు ఉంటే మరికొన్ని టీలతో కొన్ని నష్టాలు ఉన్నాయి. ఏవైనా పరిమితంగా తాగాలి. కాని చాలామంది..
Health Tips: పాల టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, ఎల్లో టీ, లెమన్ టీ, అల్లంటీ ఇలా ఎన్నో రకాల టీలు ఉన్నాయి. ఈటీలతో కొన్ని రకాల ప్రయోజనాలు ఉంటే మరికొన్ని టీలతో కొన్ని నష్టాలు ఉన్నాయి. ఏవైనా పరిమితంగా తాగాలి. కాని చాలామంది ఏమి తీసుకున్నా ఆరోగ్యంగా ఉండాలనుకుంటుంటారు. ఇటీవల కాలంలో ఆరోగ్య సంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనిలో భాగంగా ఏమి తిన్నా, తాగినా అది మన ఆరోగ్యాన్ని మరింత బలోపేతం చేసేదిగా ఉండాలని అంతా అనుకుంటారు. మరి ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న టీ ఒకటుంది. అదే జామ ఆకుల టీ.. జామ కాయలులో ఎన్నో రకాల ప్రోటీన్లు ఉన్నాయని మనకు తెలుసు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు జామకాయలు తినడం మనం చూస్తాం. అలాగే జామ ఆకుల్లో కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయట.. జామ ఆకుల టీ తాగితే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతామో తెలుసుకుందాం.
ఆరోగ్య సంరక్షణకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చే వారు రోజూ ఉదయం జామకాయ టీ తాగాలంటున్నారు నిపుణులు. పుష్కలమైన పోషకాహార ప్రొఫైల్ కారణంగా జామకాయను సూపర్ ఫ్రూట్‌గా చెప్తారు. జామకాయ 80% నీటిని కలిగి ఉంటుంది. దీనిలో విటమిన్ సి, అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు, గుండె-ఆరోగ్యకరమైన పోషకాలతో సహా, ఆరోగ్య ప్రయోజనకరమైన పోషకాలతో కూడి ఉంటుంది. అలాగే జామ ఆకులతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వాటిని టీలో చేర్చుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. జామ ఆకుల నుంచి తయారైన టీలో ఫ్లేవనాయిడ్లు, ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి ఖచ్చితంగా కడుపు, పేగు పరిస్థితులు, వాపు, అధిక రక్తంలో చక్కెర స్థాయిలు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఔషధమని సూచిస్తున్నారు.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది: జామకాయ, జామ ఆకులు రెండూ విటమిన్ సితో సమృద్ధిగా నిండి ఉంటాయి. ఇవి బహుళ ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాలను రాకుండా చేస్తాయి. అంతేకాకుండా దాని యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఏవైనా ఇన్ఫెక్షన్‌కు చికిత్స చేసేటప్పుడు శరీరంలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కోవడంలో సహాయపడతాయి.
చర్మ ఆరోగ్యానికి దివ్య ఔషధం: జామ ఆకులో ఉండే అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు మృదువుగా ఉండే చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని కాపాడుతూ వృద్ధాప్య ప్రక్రియను తగ్గిస్తాయి. అంతేకాకుండా జామ ఆకుల టీ యాంటీమైక్రోబయాల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని మొటిమల నుంచి కాపాడుతుంది.
బరువు తగ్గడానికి: జామ ఆకుల టీ వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. స్వీట్స్ కోరికలను తగ్గించి.. ఆకలిని అరికడుతుంది. ఇవన్నీ మీ శరీరం నుంచి అదనపు పౌండ్లను తొలగించడంలో సహాయపడతాయి.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది: లైకోపీన్ అనేది ఒక యాంటీఆక్సిడెంట్, ఇది క్యాన్సర్ సంభావ్యతను తగ్గిస్తుంది. జామ ఆకులలో ఈ యాంటీఆక్సిడెంట్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇది విధ్వంసక కణాల నుంచి ఫ్రీ రాడికల్స్‌ను రక్షిస్తుంది. కాబట్టి క్యాన్సర్ కణాల వృద్ధిని తగ్గిస్తుంది.
రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గిస్తుంది: జామ ఆకులలో తగిన పరిమాణంలో పొటాషియం ఉంటుంది. జామకాయ మొత్తం ఫైబర్‌తో నిండి ఉంటుంది. ఈ రెండూ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..