Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ పథకానికి మరింత బూస్ట్.. ప్రీమియం తగ్గింపు యోచనలో కేంద్రం
పేద, నిరుపేద, మధ్యతరగతి, ధనవంతులు ఇలా ఏ వర్గాల వారిలోనైనా చాలామంది వ్యక్తులు ఏ ఆరోగ్య బీమా పథకాన్ని పొంది ఉండక ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఆర్ధికంగా దిగువున ఉన్నవారు ఆరోగ్య భీమాను ను పొందడంలేదు.
Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజనను విస్తరించాలని మరింత మందికి ఈ పథకం ప్రయోజనాలు అందేలా చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇదే విషయాన్నీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ పథకం ఆరోగ్య బీమా పథకం కవరేజీని పెంచి నామమాత్రపు ప్రీమియంతో కొత్త లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందని అధికారులు తెలిపారు. ఈ పథకాన్ని 2018లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలకు ఆరోగ్య బీమా కల్పించడమే ఆయుష్మాన్ భారత్ పథకం ఉద్దేశం. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకూ 10.74 కోట్ల కుటుంబాలకు 5 లక్షల బీమా రక్షణను అందించింది.
హిందూస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఈ పథకం విస్తరణ గురించి వివరిస్తూ, ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజనను మరింత బలోపేతం చేసే ప్రక్రియలో ఉన్నామని.. తద్వారా ప్రజలందరికీ ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇది దేశంలోని నిరుపేద ప్రజలకు చాలా అవసరమని అన్నారు. చెల్లింపుదారులకు నామమాత్రపు ప్రీమియంతో లభించే సౌకర్యాన్ని పెంచాలా వద్దా అనే విషయాన్ని కూడా తీవ్రంగా పరిశీలిస్తున్నామని, ఇదే జరిగితే ప్రస్తుత లబ్ధిదారుల జాబితా కంటే ఇది చాలా ఎక్కువ మందికి అందుబాటులోకి రానున్నదని ఆయన అన్నారు.
మధ్యతరగతి వర్గాలకు కూడా ప్రయోజనం: పేద, నిరుపేద, మధ్యతరగతి, ధనవంతులు ఇలా ఏ వర్గాల వారిలోనైనా చాలామంది వ్యక్తులు ఏ ఆరోగ్య బీమా పథకాన్ని పొంది ఉండక ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఆర్ధికంగా దిగువున ఉన్నవారు ఆరోగ్య భీమాను ను పొందడంలేదు. అయితే ఈ ఆయుష్మాన్ భారత్ పథకం ప్రస్తుతం సామాజిక-ఆర్థిక, కుల గణన (SECC)తో పాటు రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (RSBY) డేటాబేస్‌లను ఉపయోగించి గుర్తించబడిన పేద, బలహీన వర్గాలకు ఆరోగ్య రక్షణను అందిస్తోంది. ఆరోగ్య బీమా ప్రీమియం ప్రస్తుతం రూ.1200-1300 వరకు ఉంది. ఈ పథకంలో లబ్ధిదారుల ఖర్చుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తున్నాయి.
చాలా మంది సంవత్సరానికి రూ. 1,00,000 సంపాదిస్తారు.. మరికొందరు సంవత్సరానికి రూ. 10,00,000 సంపాదిస్తారు. మున్ముందు ఆదాయం పెరుగుతూనే ఉంది. పెరుగున్న సంపాదన అనుగుణంగా అవసరాలు, ఖర్చులు పెరుగుతాయి కనుక అప్పటికీ పేద, మధ్యతరగతి వారు అన్ని ఆరోగ్య ఖర్చులను భరించలేరు. దీని వలన లబ్ధిదారుల జాబితా పరిధిని పెంచాల్సిన అవసరం ఉందని.. ఈ పథకాన్ని మరింత విస్తరించాలని ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..