AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవం.. వ్యూహం ఇదేనా..

తెలంగాణ రాజకీయాలు మరింత హీట్ ఎక్కుతున్నాయి. వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో బలపడాలని బీజేపీ శాయశక్తులా ప్రయత్పిస్తోంది. దీని కోసం అవసరమైన అన్ని అవకాశాలను ఉపయోగించుకునే

Telangana: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవం.. వ్యూహం ఇదేనా..
Kishan Reddy
Amarnadh Daneti
|

Updated on: Sep 03, 2022 | 1:47 PM

Share

Telangana: తెలంగాణ రాజకీయాలు మరింత హీట్ ఎక్కుతున్నాయి. వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో బలపడాలని బీజేపీ శాయశక్తులా ప్రయత్పిస్తోంది. దీని కోసం అవసరమైన అన్ని అవకాశాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు అధికార టీఆర్ ఎస్ మాత్రం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఈరెండు పార్టీలు నువ్వా-నేనా అన్నట్లు రాజకీయ క్షేత్రంలో పోరాడుతుంటే.. మధ్యలో నేనున్నా అంటూ కాంగ్రెస్ కూడా హాడావుడి చేస్తోంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని (లిబరేషన్ డే)గా అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈకార్యక్రమం నిర్వహించనున్నారు. హైదరాబాద్ లో ఈనెల 17వ తేదీన జరిగే ఈకార్యక్రమంలో పాల్గొనాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ సీఎంలకు లేఖ రాశారు. లిబరేషన్ డేను ఏడాదిపాటు నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. ప్రారంభ కార్యక్రమాన్ని సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్ లో నిర్వహించాలని నిర్ణయించామని కిషన్ రెడ్డి సీఎంలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గెస్ట్ ఆఫ్ హనర్ గా హాజరుకావాలని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ఆహ్వానం పలికారు.

కేసీఆర్ తో పాటు, మహారాష్ట్ర సీఏం ఎక్ నాథ్ షిండే, కర్ణాటక సీఎం బస్వరాజు బొమ్మైకు కేంద్రమంత్రి ఆహ్వాన లేఖలు రాశారు. కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయం రాజకీయ రచ్చకు దారితీసింది. కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన 8ఏళ్ల తర్వాత బీజేపీకి లిబరేషన్ డే గుర్తొచ్చిందా అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా దీనిపై స్పందిచలేదు. అయితే టీఆర్ ఎస్ మాత్రం దీనిని రాజకీయ స్టంట్ గా భావిస్తోంది. కేంద్రప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఈకార్యక్రమంపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..