Beetroot: క్యాన్సర్‌ను తరమికొట్టే దివ్య ఔషదం.. తాజా పరిశోధనలలో సరికొత్త నిజాలు..

Beetroot: క్యాన్సర్‌ను తరమికొట్టే దివ్య ఔషదం.. తాజా పరిశోధనలలో సరికొత్త నిజాలు..
Beetroot In Winters

బీట్‌ రూట్‌  తో ఎన్నో ప్రయోజనాలున్నాయి. డైలీ ఒక గ్లాస్‌ ఈ జ్యూస్‌ తీసుకుంటే డాక్టర్‌ వద్దకు వెళ్లే పనే ఉండదు.. శరీరానికి కావలసిన పోషకాలు అన్ని అందుతాయి. తాగిన తర్వాత షుగర్ లెవల్స్ హెల్త్ పై..

Sanjay Kasula

|

Jan 26, 2022 | 10:24 PM

బీట్‌ రూట్‌  తో ఎన్నో ప్రయోజనాలున్నాయి. డైలీ ఒక గ్లాస్‌ ఈ జ్యూస్‌ తీసుకుంటే డాక్టర్‌ వద్దకు వెళ్లే పనే ఉండదు.. శరీరానికి కావలసిన పోషకాలు అన్ని అందుతాయి. తాగిన తర్వాత షుగర్ లెవల్స్ హెల్త్ పై ఎంత ప్రభావం కనిపిస్తుందో అనే అనుమానం ఉండనే ఉంటుంది. కానీ ఇది అలాంటిది కాదు. కార్డియోవాస్క్యూలర్ హెల్త్, బ్రెయిన్ ఫంక్షన్ పై పవర్ ఫుల్ గా పనిచేస్తుంది.

కరోనా ప్రభావంతో కాలానుగుణ పండ్లు, కూరగాయలు చాలా మంది పెద్ద ఫ్యాన్స్‌గా మారుతున్నారు. బీట్‌ రూట్‌ జ్యూస్‌ వల్ల రక్తహీనతతో బాధపడేవారికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. దీని వల్ల రక్తం త్వరగా తయారయ్యేందుకు ఉపయోగపడుతుంది. రక్తహీనత సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఇక రోజంతా నీరసంగా ఉండేవారు ఉదయం సమయంలో బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉండడమే కాకుండా ఎంతో శక్తి అందుతుంది.

బీట్‌రూట్‌లో శరీరానికి కావాల్సిన చాలా విటమిన్స్‌ ఉంటాయి. బీ,సీ విటమిన్స్‌ అందుతాయి. బీట్ రూట్‌లో కాల్షియంతో పాటు మెగ్నిషియం కూడా పుష్కలంగా ఉంటుంది. అలాగే పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. కాలేయం శుభ్రం కావడానికి బీట్‌రూట్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

రుచూ బీట్ రూట్ తింటూ ఉంటే గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటారని పోషకాహార నిపుణులు చెప్పారు. రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగితే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు.

బీట్ రూట్ గర్భిణీలకు చాలా మంచిది. ప్రెగ్నెంట్స్ కు కావాల్సిన ఫోలిక్ యాసిడ్ మొత్తం కూడా బీట్ రూట్ ద్వారా అందుతుంది. గర్భంలోని పిండం సక్రమంగా ఎదగాలంటే గర్భిణీలు రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగడం మంచిది.

అంతే కాదు ఈ సంగతి మీకు తెలుసా? నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రచురించిన “బీట్‌రూట్ యాజ్ ఎ పొటెన్షియల్ ఫంక్షనల్ ఫుడ్ ఫర్ క్యాన్సర్ కెమోప్రెవెన్షన్” అధ్యయనం ప్రకారం.. బీట్‌రూట్ క్యాన్సర్‌ను నివారించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.  కీమోథెరపీతో సంబంధం ఉన్న అవాంఛనీయ ప్రభావాలను కూడా నిర్వహిస్తుంది. 

బీట్‌రూట్ ఎరుపు రంగు బీటాలైన్స్ అని పిలువబడే సమ్మేళనాల నుండి వస్తుందని మనందరికీ తెలుసు. ఇది గుండె , క్యాన్సర్-రక్షణ రెండింటినీ కలిగి ఉంటుందని అధ్యయనం పేర్కొంది. అధ్యయన నివేదిక ప్రకారం, జంతు అధ్యయనాలలో, బీట్‌రూట్ క్యాన్సర్ కారకం ఏర్పడటాన్ని నిరోధిస్తుంది. క్యాన్సర్ అభివృద్ధితో పోరాడటానికి సహాయపడే రోగనిరోధక కణాలు.. శరీర ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఇంకా ఇలా పేర్కొంది, “బీట్‌రూట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ఫంక్షనల్ ఫుడ్‌గా క్యాన్సర్‌లో సంభావ్యంగా ప్రయోజనకరంగా ఉండవచ్చు. పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు, డైటరీ నైట్రేట్‌లు..  ఇతర ఉపయోగకరమైన పోషకాల మూలంగా, బీట్‌రూట్ సప్లిమెంటేషన్ క్యాన్సర్‌ను నిరోధించడానికి, కీమోథెరపీతో సంబంధం ఉన్న అవాంఛనీయ ప్రభావాలను నిర్వహించడానికి సంపూర్ణ మార్గాలను అందిస్తుంది.

ఇవి కూడా చదవండి: Viral Video: నువ్వు తగ్గొద్దన్న.. పాకిస్తాన్ జర్నలిస్ట్ మళ్లీ ఏసేశాడు.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

Medicinal Plants: ఔషద మొక్కల పెంపకంతో అద్భుతాలు.. ఎలాంటివి ఎంచుకోవాలో తెలుసా..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu