Banana Peel: అరటి తొక్కను ఇలా వాడితే జలుబు, దగ్గు, గొంతునొప్పి మాయం.. ప్రయోజనాలు కూడా ఎక్కువే..
అరటి పండు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే అరటి పండు మాత్రమే కాకుండా.. దాని తొక్క కూడా మనకు అనేక ప్రయోజనాలు
అరటి పండు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే అరటి పండు మాత్రమే కాకుండా.. దాని తొక్క కూడా మనకు అనేక ప్రయోజనాలు కలిగిస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గొంతులో నొప్పి, జలుబు, దగ్గ వంటి సమస్యలను తగ్గించడంలో ప్రధాన పాత్ర పొషిస్తుంది. మరి అరటి తొక్కను ఎలా వాడితే ఈ అనారోగ్య సమస్యలు తగ్గుతాయో తెలుసుకుందామా…
జలుబు, దగ్గు వలన వచ్చే గొంతు నొప్పిని తగ్గించడానికి ముందుగా అరటి తొక్కను నాలుగు భాగాలుగా విడదీయాలి. గ్యాస్ పై పాన్ పెట్టి వేడయ్యాక అరటి తొక్కను వేయాలి. తొక్కను ఎక్కువ సేపు వేడి చేయ్యాలి. ఒక మందపాటి టవల్లో ఆ వేడి అరటి తొక్కను వేసి మడిచి.. మెడ చుట్టూ ఆ టవల్ చుట్టాలి.. ఇలా చేయగానే..మీ గొంతు నొప్పి నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. అరటి తొక్కను గొంతు చుట్టూ వచ్చేలా చూసుకోండి.. ఇలా పది నుంచి పదిహేను నిమిషాల పాటు మీ గొంతును వేరే టవల్ తో చుట్టాలి. గుర్తుపెట్టుకోండి.. ఇలా చేస్తున్నప్పుడు కానీ..చేసిన తర్వాత అస్సలు చల్లటి నీరు తాగకూడదు.
ఇత అరటి తొక్కను చర్మంపై తేలికగా రుద్దడం వలన మచ్చలు తొలగిపోతాయి. ఇందుకోసం అర టీస్పూన్ తేనే.. చిటికెడు పసుపు అరటి తొక్కపై వేయాలి.. ఇక కళ్ల అలసటను తగ్గించడానికి అరటి తొక్కలను దొసకాయ ముక్కలుగా ఉపయోగించవచ్చు. ఇలా చేయడానికి ముందు కాసేపు ఫ్రీజ్ లో పెట్టాలి. అరటి తొక్కలను పాదాలకు రాస్తే నొప్పి తగ్గుతుంది. ఇందుకు అర తొక్కను బాగా వేడి చేసి టవల్ లో చుట్టు పాదాలకు చూట్టుకోవాలి. అలాగే లెదర్ షూలను పాలిష్ చేయడానికి కూడా అరటి తొక్కను ఉపయోగించవచ్చు. ఇందుకు తొక్క లోపలి భాగాన్ని షూపై రుద్దాలి.
Also Read: Nani: స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన నాని.. శ్యామ్ సింగరాయ్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే…