Swetha Varma: స్ట్రాంగ్ కంటెస్టెంట్‏గా పేరు.. అనుహ్యాంగా ఎలిమినేట్.. బిగ్‏బాస్ షోకు శ్వేత రెమ్యునరేషన్ ఎంతంటే..

నటీనటులుగా ఎదగాలి.. ఫేమస్ అవ్వాలని అనుకున్న వారికి బిగ్‏బాస్ రియాల్టీ షో లక్కీ ఛాన్స్ అని చెప్పవచ్చు.. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్..

Swetha Varma: స్ట్రాంగ్ కంటెస్టెంట్‏గా పేరు.. అనుహ్యాంగా ఎలిమినేట్.. బిగ్‏బాస్ షోకు శ్వేత రెమ్యునరేషన్ ఎంతంటే..
Swetha Varma
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 18, 2021 | 10:24 AM

నటీనటులుగా ఎదగాలి.. ఫేమస్ అవ్వాలని అనుకున్న వారికి బిగ్‏బాస్ రియాల్టీ షో లక్కీ ఛాన్స్ అని చెప్పవచ్చు.. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్.. తమ ఆట తీరు.. వ స్వభావంతో ప్రేక్షకులలో స్థానం సంపాదించుకుంటారు.. అయితే ఈ షో ద్వారా ఫేమస్ అయిన వారు డ్యామేజ్ కావచ్చు.. అసలే పాపులారిటీ లేని వాళ్లు క్లిక్ అవ్వచ్చు.. బిగ్‏బాస్ వీడిన తర్వాత కంటెస్టెంట్స్‏కు ఆఫర్స్ మాత్రం క్యూ కడుతుంటాయి. అందుకే చాలా మంది బిగ్‏బాస్ షోకు వెళ్లేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఒకవేళ అవకాశం వస్తే ఎందుకు వదలుకుంటారు.. అలాంటి బంపర్ ఆఫర్ తనకు రావడంతో.. వెంటనే ఓకే చెప్పేసింది నటి శ్వేత వర్మ..

ది రోజ్ విల్లా,.. ముగ్గురు మొనగాళ్లు.. పచ్చీస్, సైకిల్ వంటి చిత్రాల్లో పలు వెబ్ సిరీస్ లలో నటించింది శ్వేత.. కానీ ఆశించనంత గుర్తింపు మాత్రం రాలేదు.. ఈ క్రమంలోనే బిగ్‏బాస్ ఆఫర్ ద్వార ఇంట్లోకి అడుగుపెట్టిన శ్వేత.. తన ఆటతీరుతో స్ట్రాంగ్ అని నిరూపించుకుంది. తను అనుకున్న మాటలను ముక్కు సూటిగా చెప్పడం.. ఇతరుల తప్పును వెలేత్తి చూపడంలో శ్వేత ముందుటుంది.. అలాగే… టాస్కులలో గట్టి పోటినిస్తూ.. స్ట్రాంగ్ కంటెస్టెంట్‏గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ బిగ్‏బాస్ షో ద్వారా కావాల్సినంత పాపులారిటీని.. ఫాలోయింగ్ అందుకున్న శ్వేత.. అనుహ్యంగా నిన్నటి ఎపిసోడ్‏లో ఎలిమినేషన్ అయి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. దీంతో ఆమె అభిమానులు నిరాశ చెందారు..

ఇదిలా ఉంటే.. ఇప్పుడు సోషల్ మీడియాలో శ్వేత బిగ్‏బాస్ షోకు తీసుకున్న రెమ్యునరేషన్ గురించి చర్చ నడుస్తోంది. ఆరువారాలు స్ట్రాంగ్ అనిపించుకుని ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్వేతకు ఎంత డబ్బు వచ్చిందనేది ఇప్పుడు నెట్టింట్లో చర్చ. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. శ్వేతకు వారానికి రూ. 60-90 వేల వరకు ఇస్తున్నారట.. ఆమె ఆరు వారాల పాటు బిగ్‏బాస్ ఇంట్లో ఉంది.. ఈ లెక్కన ఆమెకు సుమారు రూ.5 లక్షల వరకు ఆదాయం వచ్చినట్లుగా టాక్ నడుస్తుంది.

Also Read: Samantha: నాపై నీకు ఇంత అధికారం ఎలా వచ్చింది.. ఆసక్తికర పోస్ట్ చేసిన సమంత..

Kasturi Sankar: బిగ్‏బాస్‏లో కనిపిస్తున్నవన్ని నిజాలు కావు.. గృహలక్షి నటి షాకింగ్ కామెంట్స్…

Nagarjuna: రీమేక్ చిత్రాలపై మనసు పడుతున్న టాలీవుడ్ స్టార్ హీరోస్.. మరో అడుగు ముందుకేసిన నాగార్జున..