Nagarjuna: రీమేక్ చిత్రాలపై మనసు పడుతున్న టాలీవుడ్ స్టార్ హీరోస్.. మరో అడుగు ముందుకేసిన నాగార్జున..
ప్రస్తుతం రీమేక్ చిత్రాల హవా నడుస్తోంది. తెలుగు, హిందీ, తమిళ్.. ఇలా భాషతో సంబంధం లేకుండా.. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు
ప్రస్తుతం రీమేక్ చిత్రాల హవా నడుస్తోంది. తెలుగు, హిందీ, తమిళ్.. ఇలా భాషతో సంబంధం లేకుండా.. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు సినీ పరిశ్రమలో రీమేక్ చిత్రాలు విడుదలై రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఒరిజినాలిటీని మిస్ చేయకుండా.. అలాగే తెరకెక్కించిన.. మార్పులు జరపి స్థానికతను జోడించిన ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. రీమేక్ సినిమాలకు పట్టం కడుతున్నారు. దీంతో సొంత స్టోరీలే కాకుండా.. రీమేక్ స్టోరీలపై దర్శకనిర్మాతలకు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.. ఇక ఇదే బాటలోనూ స్టార్ హీరోస్ నడుస్తున్నారు. ఇప్పటికే తెలుగులో పవన్.. మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవలే నారప్ప సినిమాతో వెంకీ మామా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు…
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. భీమ్లా నాయక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. ఇది మలయాళం సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు తెలుగు రీమేక్. అలాగే.. మెగాస్టార్ చిరంజీవి.. చేస్తున్న గాడ్ ఫాదర్.. భోళా శంకర్ సినిమాలు సైతం రీమేక్ చిత్రాలే. అయితే ఎప్పుడు విభిన్న దారిలో ప్రయాణించే కింగ్ నాగ్.. ఈసారి తన పంథా మార్చుకున్నాడు.. కేవలం ప్రేమ… ఫ్యామిలీ… రొమాంటిక్ చిత్రాలే కాకుండా.. రీమేక్ సినిమాలు చేయాలనుకుంటున్నాడట. ఇన్నాళ్లు ఇతర భాష చిత్రాల పై ఆసక్తి చూపని నాగార్జున.. ఈసారి ఏకంగ మలయాళ సినిమా రీమేక్ చేయాలని భావిస్తున్నారట. ది గ్రేట్ ఇండియన్ కిచన్ సినిమా.. ఈ ఏడాది జనవరిలో మలయాళంలో విడుదలై సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాకు జియో బేబీ దర్శకత్వం వహించగా..నిమిషా సాజయన్, సూరజ్ వెంజరముడు కీలక పాత్రలలో నటించారు.. ళ్లి చేసుకుని ఎన్నో ఆశలతో కొత్తగా కాపురానికి వచ్చిన ఒక యువతి తన ఆలోచనలను .. అభిరుచులను .. అభిప్రాయాలను .. ఇష్టాలను పక్కన పెట్టేసి ఆ ఇంట్లో ఎలా సర్దుకుపోయింది? సున్నితమైన విషయాలుగానే కనిపించే కొన్ని సంఘటనలు ఆమె సహనాన్ని ఎలా పరీక్షించాయి? అనేదే ఈ మూవీ స్టోరీ.. ఇక ఈ సినిమాను నాగ్ చేయాలనుకుంటున్నారట. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నట్లుగా టాక్… ప్రస్తుతం నాగార్జున బంగార్రాజు.. ఘోస్ట్ సినిమాలు చేస్తున్నాడు.
Also Read: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకూమారి.. మొదటి సినిమాతోనే తెలుగులో ఫుల్ క్రేజ్.. గుర్తుపట్టండి..