ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకూమారి.. మొదటి సినిమాతోనే తెలుగులో ఫుల్ క్రేజ్.. గుర్తుపట్టండి..

పైన ఫోటోలో ఉన్న చిన్నారికి ఇప్పుడు ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ప్రేక్షకులను

ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకూమారి.. మొదటి సినిమాతోనే తెలుగులో ఫుల్ క్రేజ్.. గుర్తుపట్టండి..
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 18, 2021 | 8:26 AM

పైన ఫోటోలో ఉన్న చిన్నారికి ఇప్పుడు ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ప్రేక్షకులను తన అందం.. అభినయంతో అలరించడమే కాకుండా.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ జాబితాలో చేరింది. మొదటి సినిమా విడుదల కాకముందే ఈ హీరోయిన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఎవరో గుర్తుపట్టండి.. కేవలం నటనే కాదు.. అన్ని కళలను అందిపుచ్చుకుంది ఈ చిన్నది.. దర్శకనిర్మాతలతో ప్రశంసలు అందుకుంటూ టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయ్యేందుకు అడుగుల దూరంలో ఉంది.. గుర్తుపట్టగలరా..

Actress 1

తెలుగులో ఈ అమ్మడు నటించిన మొదటి సినిమా సూపర్ హిట్ అందుకుంది… అయితే సినిమా రిలీజ్ కంటే ముందే ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ చిన్నారికి తెలుగు ఆడియన్స్ పట్టం కట్టారు.. ఫస్ట్ మూవీతో భారీ హిట్ ఇచ్చి అక్కున చేర్చుకున్నారు..

Actress 2

కేవలం నటన మాత్రమే కాకుండా ఈ చిన్నారిలోని కళలు అనేకం ఉన్నాయి.. నటనలో స్టార్ హీరోయిన్స్‏కు ఏమాత్రం తీసిపోకుండ ఉండడమే కాకుండా.. డ్యాన్స్‏లోనూ ప్రతిభ చాటుకుంది. వెస్ట్రర్న్ డ్యాన్స్ మాత్రమే కాకుండా.. సంప్రదాయ నృత్యంలోనూ ఈ అమ్మడు అదుర్స్.. గుర్తుపట్టారా.. ప్రస్తుతం డాక్టర్ చదువుతున్న ఈ చిన్నది.. దక్షిణాది చిత్రపరిశ్రమలో భాషతో సంబంధం లేకుండా వరుస ఆఫర్లను అందుకుంటుంది. గుర్తుపట్టేశారా.. అయితే మీకోసం చిన్న క్లూ… ఈ ముద్దుగుమ్మ నటనకు.. తెలివికి… టాలెంట్‏కు దర్శకేంద్రుడు సైతం ఫిదా అయ్యాడు.. ప్రశంసలతో ముంచెత్తాడు..

Sreeleela

Sreeleela

ఇప్పుడు గుర్తుపట్టారనుకుంటా.. తను మరెవరో కాదండోయ్… పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీల.. ఇటీవల దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందD సినిమా ద్వారా తెలుగు చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించాడు.. దసరా కానుకగా విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అందుకుంది. మొదటి సినిమాతో ఫుల్ ఫాలోయింగ్ అందుకుంది. ఈ అమ్మడుకి తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. శ్రీలీల తెలుగమ్మాయే అయినప్పటికీ కన్నడలో సెటిల్ అయ్యింది. ముంబైలో డాక్టర్ చదువుతుంది ఈ బ్యూటీ.

View this post on Instagram

A post shared by Sreeleela (@sreeleela14)

Also Read: Bigg Boss 5 Telugu: తృటిలో తప్పించుకున్న సిరి.. ఎలిమినేట్ అయిన శ్వేత.. బోరున ఏడ్చేసిన యానీ మాస్టర్..

Bigg Boss 5 Telugu: డేంజర్.. రవికి దూరంగా ఉండండి.. అనుభవంతో చెప్తున్న.. మరోసారి రవిని బుక్ చేసిన శ్వేత..