AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: తృటిలో తప్పించుకున్న సిరి.. ఎలిమినేట్ అయిన శ్వేత.. బోరున ఏడ్చేసిన యానీ మాస్టర్..

బిగ్ బాస్ ఆరోవారం ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారమే.. ఈ ఆదివారం ఇంటి నుంచి

Bigg Boss 5 Telugu: తృటిలో తప్పించుకున్న సిరి.. ఎలిమినేట్ అయిన శ్వేత.. బోరున ఏడ్చేసిన యానీ మాస్టర్..
Swetha
Rajitha Chanti
|

Updated on: Oct 18, 2021 | 7:02 AM

Share

బిగ్ బాస్ ఆరోవారం ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారమే.. ఈ ఆదివారం ఇంటి నుంచి శ్వేత వర్మ ఎలిమినేట్ అయ్యింది. ఇక నిన్నటి (అక్టోబర్ 18న) ఎపిసోడ్‏లో సండేను ఫన్ డేగా మార్చేశారు హోస్ట్ నాగార్జున.. ఇంటి సభ్యులను ఎంటర్ టైన్ చేస్తూ.. కొన్ని గేమ్స్ ఆడించాడు నాగార్జున.. ఇక గేమ్ మధ్యలోనే ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చాడు.. ముందుగా.. లోబో గురించి.. వాళ్ల తండ్రి చనిపోవడం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు రవి..

ఇక ఆతర్వాత.. ఎంట్రీ ఇచ్చిన నాగ్.. ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడదీసి.. రవిని సంచాలకుడుగా నియమించాడు.. ఇక ఏ టీలో సిరి, షన్ను, కాజల్, శ్రీరామ్, ప్రియాంక, విశ్వ ఉండగా.. టీం బీలో మానస్, సన్నీ, యానీ మాస్టర్, శ్వేత, ప్రియ, జెస్సీలను నియమించాడు.. ఇక ముందుగా పిప్పిప్పీ అని ఊదుకుంటూ పాటలను గెస్ చేయాలని సూచించాడు నాగార్జున.. ఇక అనంతరం కళ్లకు గంతలు కట్టి.. బోన్ పట్టుకునే గేమ్ ఆడించాడు నాగార్జున.  కళ్లకు గంతలు కడితే.. మిగతా వాళ్లంతా డైరెక్షన్ ఇస్తూ ఉండాలి.. హూలా హూప్స్ మధ్యలో పెట్టిన బోన్‌ను పట్టుకోవాలి. గేమ్స్ ఆడుతున్న మధ్యలోనే ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చిన నాగ్.. చివరకు సిరి, శ్వేతలు డేంజర్ జోన్లో ఉన్నట్టుగా తెలిపారు.. అనంతరం వారిద్దరిని గార్డెన్ ఏరియాకు రమ్మన్నాడు నాగ్. సుత్తితో అక్కడున్న డబ్బాను పగలగొట్టమన్నాడు. అందులో వచ్చిన మరో బాక్సును లివింగ్ ఏరియాకు తీసుకురమ్మన్నాడు. ఆ డబ్బాలో సిరి బొమ్మ ఉండటంతో ఆమె సేఫ్ అయినట్టు నాగ్ ప్రకటించాడు. దీంతో చివరగా మిగిలిన శ్వేతాను ఎలిమినేట్ అయిందని ప్రకటించాడు నాగ్.. శ్వేత ఎలిమినేట్ కావడంతో యానీ మాస్టర్ వెక్కి వెక్కి ఏడ్చింది.

Also Read: Bigg Boss 5 Telugu: ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేది ఈ కంటెస్టెంటేనా..?

Bigg Boss 5 Telugu: రూటు మార్చిన బిగ్‏బాస్.. యాంకర్స్‏ను పక్కనపెట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వాళ్లను..

Bigg Boss 5 Telugu: లోబో ఎలిమినేట్.. గుక్కపెట్టి ఏడ్చిన విశ్వ.. అందరి గురించి తెలుసుకోమంటూ లక్కీ ఛాన్స్..

Bigg Boss 5 Telugu: మరోసారి అడ్డంగా దొరికిపోయిన రవి.. నిజంగానే గుంటనక్క అనేసిన నాగార్జున..

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం