Bigg Boss 5 Telugu: ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేది ఈ కంటెస్టెంటేనా..?
బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే గొడవలు, అల్లరులు ఏడుపులు లతో నానా హంగామాగా సాగుతుంది.
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే గొడవలు, అల్లరులు ఏడుపులు లతో నానా హంగామాగా సాగుతుంది. ఇప్పటికే ఐదుగురు హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. మొదటి వారం ఫైర్ బ్రాండ్ సరసు, రెండో వారం ఉమాదేవి, ఆ తర్వాత లహరి, నటరాజ్ మాస్టర్, హమీద బయటకు వచ్చేశారు. ఇక ఇప్పుడు హౌస్ నుంచి ఆరో కాంటెస్ట్ బయటకు రానుంది. ఈ వారం హౌస్ నుంచి బయటకు ఎవరు బయటకు వస్తారా అన్నది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈవారం నామినేషన్‌లో పది మంది నామినేషన్స్‌లో ఉండటంతో పాటు.. వారిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారు? సీక్రెట్ రూంలోకి ఎవరు వెళ్లారనే ఉత్కంఠ మొదలైంది.
ఇక నామినేషన్ లో షణ్ముఖ్, జెస్సీ, సిరి, రవి, శ్రీరామ్, లోబో, విశ్వ, ప్రియాంక , శ్వేత, సన్నీ.. ఇలా పదిమంది నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు సీక్రెట్ రూంలోకి.. మరొకరు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లనున్నారు. అయితే వీరిలో లోబో ఎలిమినేట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసి సీక్రెట్ రూంలోకి పంపనున్నారని తెలుస్తుంది. అలాగే శ్వేత ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు రానుందని టాక్. ఇక ఓటింగ్ లో కూడా ఈ ఇద్దరే వీక్ గా ఉన్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో శ్వేత బయటకు రానుంది. మరి బయటకు వచ్చిన తర్వాత శ్వేత ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడుతుందో.. ఎలాంటి నిజాలు బయట పెడుతుందో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :