Manchu Vishnu: శ్రీవారి ఆలయంలో విష్ణు సంచలన కామెంట్స్.. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలు అందలేదంటున్న ‘మా’ అధ్యక్షుడు
Manchu Vishnu: 'మా' నూతన అధ్యక్షుడు మంచు విష్ణు, తన తండ్రి మోహన్ బాబు తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మా లోని తన ప్యానల్..
Manchu Vishnu: ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు, తన తండ్రి మోహన్ బాబు తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మా లోని తన ప్యానల్ సభ్యులతో కలిసి మంచు విష్ణు ఈరోజు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. తమ మొక్కలను తీర్చుకున్నారు. దర్శనం అనంతరం మంచు మోహన్ బాబు మాట్లాడుతూ.. మూవీ ఆర్టిస్టు సంస్థ ప్రెసిడెంట్ అంటే మాములు విషయం కాదని.. చాలా చాలా బాధ్యతతో కూడుకున్న గౌరవమైనదని చెప్పారు. ఆ భగవంతుడు, మా సభ్యులందరి ఆశీర్వాదంతో నా బిడ్డ విష్ణు మా అధ్యక్షుడు కాగలిగాడని అన్నారు. ఇక విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతాడని చెప్పారు మోహన్ బాబు.
మా అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ.. తన ప్యానల్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడితేనే తాను అధ్యక్షుడైనట్లు చెప్పాడు. ఇక నుంచి తన ప్యానల్ సభ్యులకు అద్భుతమైన పనులు చేయడానికి బలం ప్రసాదించమని శ్రీవారి కోరుకున్నట్లు చెప్పారు. స్వామివారి ఆశీర్వాదం కోసం తిరుమలకు వచ్చామని తెలిపారు. అంతేకాదు.. తనకు ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు రాజీనామా చేశారని మీడియా ద్వారానే తెలిసిందని.. ఇప్పటి వరకూ తన వద్దకు రాజీనామా లేఖలు రాలేదని సంచలన కామెంట్స్ చేశారు. మా వద్దకు రాజీనామా లేఖలు వస్తే అప్పుడు ఆ విషయం గురించి మాట్లాడుతానని అన్నారు. తిరుమలలో ఎవరి గురించి కాంట్రవర్సరీలు మాట్లాడనని మా ప్రెసిడెంట్ మంచు విష్ణు చెప్పారు.
దీంతో ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఇప్పటి వరకూ రాజీనామా చేయలేదా అంటూ ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది, అంతేకాదు.. మరి రాజీనామా చేయకుండా ప్రెస్ మీట్ పెట్టి.. ఎందుకు అంత హడావిడి చేశారంటూ గుసగులు వినిపిస్తున్నాయి. రాజీనామాల విషయంపై ప్రకాష్ రాజ్ అండ్ ప్యానల్ సభ్యులు ఏమని సమాధానం చెబుతారో చూడాలి మరి
Also Read: Darshan in Tirumala: వృద్ధులకు, వికలాంగులకు శ్రీవారి దర్శనం అరగంటలోనే.. వివరాల్లోకి వెళ్తే..