Kasturi Sankar: బిగ్‏బాస్‏లో కనిపిస్తున్నవన్ని నిజాలు కావు.. గృహలక్షి నటి షాకింగ్ కామెంట్స్…

కస్తూరీ శంకర్.. ప్రేక్షకులకు ఈ పెద్దగా తెలియకపోయిన.. గృహలక్ష్మీ సీరియల్ నటి తులసి అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారు బుల్లితెర ప్రేక్షకులు..

Kasturi Sankar: బిగ్‏బాస్‏లో కనిపిస్తున్నవన్ని నిజాలు కావు.. గృహలక్షి నటి షాకింగ్ కామెంట్స్...
Kasturi
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 18, 2021 | 9:27 AM

కస్తూరీ శంకర్.. ప్రేక్షకులకు ఈ పెద్దగా తెలియకపోయిన.. గృహలక్ష్మీ సీరియల్ నటి తులసి అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారు బుల్లితెర ప్రేక్షకులు.. ఈ సీరియల్ ద్వారా తెలుగులో ఎక్కువగా ఫేమస్ అయ్యింది కస్తూరీ శంకర్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే కస్తూరీ శంకర్ తాజాగా బిగ్ బాస్ షో గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అవెంటీ.. ఎందుకు అలా మాట్లాడిందో తెలుసుకుందాం.

బిగ్‏బాస్‏ రియాల్టీ షో..బుల్లితెరపై విశేషమైన ఆదరణ పొందుతున్న అతి పెద్ద గేమ్ షో. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం ఇలా అన్ని భాషల్లో ఈ షో ప్రసారమవుతూ రేటింగ్ పరంగా దూసుకుపోతుంది. ఇక తెలుగులో గత కొద్ది రోజుల క్రితం సీజన్ 5 ప్రారంభమైన సంగతి తెలిసిందే. అటు తమిళ్ లో కూడా బిగ్‏బాస్‏లో సీజన్ 5 ప్రారంభమైంది. ఈ క్రమంలో గృహలక్ష్మీ ఫేమ్ కస్తూరీ ఇప్పటివరకు కూడా తాను ఒక్క ఎపిసోడ్ చూడలేదని.. తనలాంటి వారు ఎవరైనా ఉన్నరా ? అంటూ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.. దీంతో రకరకాల రియాక్షన్స్ వచ్చాయి. అందులో ఓ నెటిజన్ బిగ్‏బాస్‏లో మీరు నాకు నచ్చలేదంటూ కామెంట్ చేశారు.. దీంతో రియాక్ట్ అయిన కస్తూరీ తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చింది. అక్కడ నిజాలను చూపించాల్సిన అవసరం లేదు. బిగ్‏బాస్‏ షో గురించి ప్రేక్షకులకు కనిపించిందే మాట్లాడతారు.. కానీ అందులో పాల్గొని బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ మాటలు మరోలా ఉంటాయి.. 24 గంటల్లో జరిగిన సంఘటనలు కేవలం గంట ఎపిసోడ్ గా తమ నచ్చిన విధంగా ఎడిట్ చేసి ప్లే చేస్తారు.. మంచిని చెడుగా.. చెడుని మంచిగా చూపించే ఆస్కారం కూడా ఉంది… రోజులో చిన్న గొడవ జరిగిన దాన్నే హైలేట్ చేసి చూపిస్తుంటారు.. నిజంగానే బిగ్‏బాస్‏ ఓ మాయలాంటింది.. షో చూసి ఎవ్వరిని జడ్చ్ చేయకండి అంటూ చెప్పుకొచ్చింది కస్తూరీ శంకర్.. అలాగే తామంతా ఒకే కుక్కర్ లో అన్నం వండుకుంటామని.. అక్కడ కొంచెం ఫుడ్ మాత్రమే వస్తుందని.. రోజలు మారుతన్న కొద్ది మనుషులు తగ్గుతుంటారని.. దీంతో వంటసామాన్లు కూడా తగ్గిపోతాయని కస్తూరీ తెలిపింది.

Also Read:  Nagarjuna: రీమేక్ చిత్రాలపై మనసు పడుతున్న టాలీవుడ్ స్టార్ హీరోస్.. మరో అడుగు ముందుకేసిన నాగార్జున..

Manchu Vishnu: శ్రీవారి ఆలయంలో విష్ణు సంచలన కామెంట్స్.. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలు అందలేదంటున్న ‘మా’ అధ్యక్షుడు