Nani: స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన నాని.. శ్యామ్ సింగరాయ్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే…
న్యాచురల్ స్టార్ నాని హీరోగా.. రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న సినిమా శ్యామ్ సింగరాయ్. కలకత్తా బ్యాక్ డ్రాప్లో రూపొందుతున్న
న్యాచురల్ స్టార్ నాని హీరోగా.. రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న సినిమా శ్యామ్ సింగరాయ్. కలకత్తా బ్యాక్ డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా..మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై ఆసక్తిని కలిగించాయి. ఇక ఇటీవల దసరా కానుకగా నాని రెండవ పాత్రను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. కాళీ మాత ఆలయంలో శ్యామ్ సింగ రాయ్ ని చూపిస్తూ.. కాళీ మాత పోస్టర్ నుంచి వాసు లుక్ ని రివీల్ చేస్తూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది చిత్రయూనిట్.
తాజాగా న్యాచురల్ స్టార్ నాని.. అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు.. శ్యామ్ సింగరాయ్ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయబోతున్నాట్లుగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో విడుదల చేయబోతున్నట్లుగా నాని ప్రకటించాడు. ఈ సందర్బంగా శ్యామ్ సింగరాయ్ నుంచి నాని, సాయి పల్లవి కలిసి ఉన్న ఫోటోను రివీల్ చేశారు.. . ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాకు మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ట్వీట్…
This Christmas Shyam will arrive where he belongs 🙂 To the big screen and to your hearts ?
TELUGU,TAMIL,MALAYALAM,KANNADA
DECEMBER 24th ?#ShyamSinghaRoy @Sai_Pallavi92 @IamKrithiShetty @MadonnaSebast14 @MickeyJMeyer @Rahul_Sankrityn @vboyanapalli@NiharikaEnt pic.twitter.com/pbMojsNhs8
— Nani (@NameisNani) October 18, 2021
ఇదిలా ఉంటే.. ఈ సినిమాతోపాటు.. నాని.. అంటే సుందరానికి మూవీ చేస్తున్నాడు.. అలాగే శ్రీకాంత్ ఓదేలు దర్శకత్వంలో దసరా మూవీ చేస్తున్నట్లుగా ఇటీవల ప్రకటించాడు.. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
Uma Maheswari Dead: చిత్ర సీమలో విషాదం..మెట్టెల సవ్వడి నటి ఉమా మహేశ్వరి అనారోగ్యంతో మృతి