Akkineni Akhil: ఆడపిల్ల పుడుతుందని పేరు సహా గౌన్లు, సాక్స్ సహా అన్ని కొన్న నాగార్జున.. తీరా చూస్తే.. నికిత కాదు.. అఖిల్ పుట్టాడట..
Akkineni Akhil: అక్కినేని మూడో తరం వారసుడిగా సిసింద్రీ సినిమాతో బాలనటుడిగా అలరించాడు. అఖిల్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తాజాగా..
Akkineni Akhil: అక్కినేని మూడో తరం వారసుడిగా సిసింద్రీ సినిమాతో బాలనటుడిగా అలరించాడు. అఖిల్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. దసరా కానుకగా రిలీజైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అక్కినేని అఖిల్ తన తండ్రి నాగార్జునకు ఒక కోరిక ఉందని.. అది తీరలేదని.. చెప్పాడు.
అమల గర్భంతో ఉన్న సమయంలో నాగార్జున అమెరికాలో పరీక్షలు చేయించారట.. అప్పుడు తమకు అమ్మాయి పుట్టాలని నాగార్జున అమల దంపతులు ఆశపడ్డారట.. ముఖ్యంగా నాగార్జునకు అమ్మాయి పుట్టాలని ఎంతగానో కోరుకున్నారట.. అదే సమయంలో అమలకు ట్రీట్మెంట్ ఇచ్చిన వైద్యులు కూడా అమ్మాయి పుడుతుందని చెప్పారు.. దీంతో తన కోరిక నెరవేరుతుందని.. నాగార్జున సంతోషంతో.. పుట్టబోయే పాపకు గౌన్లు, సాక్స్, ఆడపిల్లకు ఉపయోగించేవన్నీ కొన్నారని అఖిల్ చెప్పాడు. ఇక అమెరికా నుంచి భారత్ కు రావడానికి నాగార్జున, అమలలు ప్లైట్ టికెట్స్ బుక్ చేసే సమయంలో నికిత పేరు రాశారని అఖిల్ చెప్పాడు. అయితే అమలకు డెలివరీ తర్వాత అబ్బాయి పుట్టాడని చెప్పడంతో మా నాన్న షాక్ తిన్నారని అఖిల్ తన బర్త్ సీక్రెట్ ని వెల్లడించాడు. అమ్మాయి పుడుతుందని.. ముందుగానే పేరుని నిర్ణయించుకున్న నాగార్జునకు మళ్ళీ కొడుకు పుట్టాడు.. ఈ విషయం ఇప్పటికీ మా ఇంట్లో వారు గుర్తు చేసుకుని నవ్వుకుంటారని అఖిల్ చెప్పాడు.
అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమాపై దృష్టి పెట్టాడు. పాత్రకు అనుగుణంగా అఖిల్ తన బాడీని బిల్డ్ చేశాడు.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమా కూడా హిట్ కొడుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read: చిత్ర సీమలో విషాదం..మెట్టెల సవ్వడి నటి ఉమా మహేశ్వరి అనారోగ్యంతో మృతి