Baking Soda: బేకింగ్ సోడాను ఎక్కువగా వాడుతున్నారా? ఈ సమస్యలు తప్పవు.. తస్మాత్ జాగ్రత్త
Baking Soda Side Effects: కేకులు, బిస్కెట్లు తదితర బేకరీ ఫుడ్స్ రుచిగా వచ్చేందుకు కచ్చితంగా కలిపే పదార్థం బేకింగ్ సోడా. కేవలం వంటల్లోనే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది.
Baking Soda Side Effects: కేకులు, బిస్కెట్లు తదితర బేకరీ ఫుడ్స్ రుచిగా వచ్చేందుకు కచ్చితంగా కలిపే పదార్థం బేకింగ్ సోడా. కేవలం వంటల్లోనే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా చర్మ కాంతిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. అయితే బేకింగ్ సోడా పరిమితంగా తీసుకుంటే సమస్యలేదు కానీ మోతాదుకు మించి వినియోగిస్తే మాత్రం అనర్థాలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా సోడాను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంపై అనేక హానికరమైన ప్రభావాలు ఉంటాయట.
బేకింగ్ సోడా ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలేంటంటే?
గ్యాస్ట్రిక్ సమస్యలు బేకింగ్ సోడా ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం సమస్యలు తలెత్తుతాయి. సోడా తిన్నప్పుడు, అది రసాయన ప్రక్రియలో యాసిడ్‌తో కలుస్తుంది. కాబట్టి బేకింగ్ సోడాను పరిమితంగానే తీసుకోవాలి. ఎక్కువ మొత్తంలో బేకింగ్ సోడా తినడం వల్ల కూడా కడుపు నొప్పి వస్తుంది. బేకింగ్ సోడా యాసిడ్‌తో కలిపినప్పుడు, రసాయన ప్రతిచర్య జరుగుతుంది. ఒక వ్యక్తి ఒకేసారి పెద్ద మొత్తంలో బేకింగ్ సోడాను తీసుకుంటే అది కడుపులో పెద్ద మొత్తంలో గ్యాస్ కు దారి తీస్తుంది. ఇది కడుపు నొప్పిని కూడా కలిగిస్తుంది.
గుండెపోటు బేకింగ్ సోడాలో సోడియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. ముఖ్యంగా మన గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీని అధిక మోతాదు గుండెపోటు లేదా గుండె వైఫల్యానికి దారితీస్తుంది.
*బేకింగ్ సోడా ఎక్కువగా తీసుకోవడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి, కాబట్టి దీని వినియోగాన్ని తగ్గించడం చాలా ముఖ్యం.
*జీర్ణ సంబంధిత సమస్యలు ఉంటే అరకప్పు నీటిలో అర చెంచా బేకింగ్ సోడా కలుపుకుని, వారానికి 2 సార్లు మాత్రమే తాగండి. అంతకుమించి తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..