Bone Diseases: కోవిడ్ తర్వాత ఎముకల్లో నొప్పి? ఈ ప్రమాదకరమైన వ్యాధికి కారణం కావచ్చు..!
కరోనా బారిన పడిన వారు చాలా మంది ఇప్పటికే కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులతో బాధపడుతున్నట్లు వైద్య నిపుణుల నివేదికల్లో వెల్లడైంది. ప్రజలు దీనిని సాధారణ సమస్యగా లేదా ఆర్థరైటిస్..
కరోనా బారిన పడిన వారు చాలా మంది ఇప్పటికే కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులతో బాధపడుతున్నట్లు వైద్య నిపుణుల నివేదికల్లో వెల్లడైంది. ప్రజలు దీనిని సాధారణ సమస్యగా లేదా ఆర్థరైటిస్ లక్షణంగా పరిగణిస్తున్నారు. చాలా సందర్భాలలో రోగులు రక్తనాళాల నెక్రోసిస్‌తో బాధపడుతున్నారని, హిప్ కేర్ సీనియర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ అఖిలేష్ యాదవ్ అంటున్నారు. రక్తం ఎముక కణజాలానికి చేరుకోనప్పుడు అటువంటి పరిస్థితిలో ఈ వ్యాధి ప్రమాదానికి కారణం అవుతుంది. ఈ వ్యాధి ఏ వయస్సులోనైనా సంభవించవచ్చు. కానీ సాధారణంగా 20-60 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు ఎక్కువగా బాధపడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే మధుమేహం, హెచ్‌ఐవి/ఎయిడ్స్‌తో బాధపడే వారు కూడా నెక్రోసిస్ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది.
ఒక వ్యక్తి ఎముక విరిగిపోయినప్పుడు లేదా దాని స్థలం నుండి కదలినప్పుడు రక్తం ఎముకలకు చేరదని డాక్టర్ అఖిలేష్ వివరించారు. మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. జిమ్‌కు వెళ్లే యువత సప్లిమెంట్లలో స్టెరాయిడ్స్ తీసుకుంటారు. దీంతో ఎముకలు కూడా పాడైపోయి ఈ వ్యాధి బారిన పడాల్సి వస్తుంది. కోవిడ్ తర్వాత ఇలాంటి కేసులు బాగా పెరిగాయి. అవాస్కులర్ నెక్రోసిస్ వ్యాధి తుంటి, కీళ్లలో కొంతమందిలో సంభవించవచ్చు. సకాలంలో చికిత్స అవసరం, లేకుంటే ఈ వ్యాధి పూర్తిగా ఎముకలను ఉక్కిరిబిక్కిరి చేస్తుందని ఆయన పేర్కొంటున్నారు.
అవాస్కులర్ నెక్రోసిస్ యొక్క లక్షణాలు:
☛ బరువులు ఎత్తేటప్పుడు లేదా వ్యాయామం చేసేటప్పుడు కీళ్ల నొప్పులు
☛ తుంటి నొప్పి తొడలు, పెల్విస్ లేదా పిరుదులకు వ్యాపిస్తుంది
☛ చేతులు, భుజాలలో నొప్పి
అవాస్కులర్ నెక్రోసిస్ నిరోధించడానికి చర్యలు:
☛ కొలెస్ట్రాల్ స్థాయిని తక్కువగా ఉండేలా చూసుకోవాలి
☛ స్టెరాయిడ్స్ ఉపయోగించవద్దు
☛ ధూమపానం చేయవద్దు
☛ బరువు పెరగనివ్వవద్దు
☛ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి
అవాస్కులర్ నెక్రోసిస్ చికిత్స:
డాక్టర్ అఖిలేష్ తెలిపిన వివరాల ప్రకారం.. అవాస్కులర్ నెక్రోసిస్ చికిత్స వ్యాధి తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. మెడిసిన్, థెరపీ ప్రారంభంలో ఇవ్వబడతాయి. ఔషధాల నుండి ఉపశమనం లేనప్పుడు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. దీని కోసం కోర్ డికంప్రెషన్ చేయబడుతుంది. ఇందులో సర్జన్ ఎముక లోపలి పొరను తొలగిస్తాడు. ఇది నొప్పి నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా, ఆ ప్రదేశంలో కొత్త ఎముక కణజాలం ఏర్పడటం ప్రారంభిస్తుంది.
ఎముక మార్పిడి: ఈ ప్రక్రియలో సర్జన్ వ్యాధిగ్రస్తులైన ఎముకను ఆరోగ్యకరమైన ఎముకతో భర్తీ చేస్తారు. ఈ ఎముకను శరీరంలోని ఇతర భాగాల నుండి కూడా తీసుకోవచ్చు.
జాయింట్ రీప్లేస్‌మెంట్: ఇందులో అరిగిపోయిన జాయింట్‌లను తొలగించి వాటి స్థానంలో ప్లాస్టిక్, మెటల్ లేదా సిరామిక్ జాయింట్‌లు వేస్తారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి