స్మార్ట్ ఫోన్ తెగ వాడేస్తున్నారా.. అయితే ఈ 6 రకాల జాయింట్ నొప్పులు రావడం ఖాయం..

ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువైందో అప్పటినుంచి మనుషులకు కొత్త కొత్త జబ్బులు కూడా ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే దృష్టిలోపంతో చాలామంది బాధపడుతూ ఉంటే మరోవైపు ఒళ్ళు నొప్పులతో కూడా బాధపడుతున్నారు.

స్మార్ట్ ఫోన్ తెగ వాడేస్తున్నారా.. అయితే ఈ 6 రకాల జాయింట్ నొప్పులు రావడం ఖాయం..
smartphone
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 25, 2023 | 8:45 AM

ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువైందో అప్పటినుంచి మనుషులకు కొత్త కొత్త జబ్బులు కూడా ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే దృష్టిలోపంతో చాలామంది బాధపడుతూ ఉంటే మరోవైపు ఒళ్ళు నొప్పులతో కూడా బాధపడుతున్నారు. తాజాగా ఓ పరిశోధనలో స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా వాడటం ద్వారా ఆరు రకాల జాయింట్ పెయిన్స్ వస్తాయని తేల్చారు. ఆరు రకాల జాయింట్ నొప్పులు ఎలా ఉంటాయో వాటి లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మెడ, భుజం నొప్పి:

స్మార్ట్ ఫోన్ అతిగా వాడితే మెడ, భుజం నొప్పికి కారణమవుతుంది. రోజూ స్మార్ట్‌ఫోన్‌లను రెండు నుండి మూడు గంటలకు మించి ఉపయోగించడం వల్ల మెడ , భుజాల నొప్పి , నడుము నొప్పి వస్తుంది. ముఖ్యంగా మనం ఈ ఫోన్లను పడుకుని వాడితే ఈ సమస్య మరింత ముదిరే అవకాశం ఉంది అందుకే స్మార్ట్ ఫోన్ వాడేటప్పుడు నిటారుగా కూర్చొని వాడితే ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఆస్టియో ఆర్థరైటిస్:

బొటనవేలితో ఎక్కువగా టైపింగ్ చేయడం వల్ల ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా చాటింగ్ సమయంలో వేళ్లను వాడటం వల్ల కార్పోమెటాకార్పల్ జాయింట్ , ఆస్టియో ఆర్థరైటిస్‌కు దారి తీస్తుంది. ఇది యువతీ యువకుల్లో ఎక్కువగా కనిపిస్తుంది, అయితే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వృద్ధుల వ్యాధి, కొన్ని సందర్భాల్లో యువత అతిగా స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం వల్ల కార్పోమెటాకార్పాల్ జాయింట్ క్షీణత కూడా కనిపిస్తుంది.

 డి క్వెర్వైన్ , టెనోసైనోవైటిస్:

మొబైల్ ఫోన్‌ను అతిగా ఉపయోగించడం కోసం చేతులు నిరంతరం ఉపయోగించడం వల్ల మణికట్టు , రేడియల్ కోణంలో నొప్పి ప్రారంభం అవుతుంది. తద్వారా మణికట్టు ప్రాంతంలో వాపు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే స్మార్ట్ ఫోన్ వాడేటప్పుడు అతిగా చేతిని ఉపయోగిస్తే ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది

 తిమ్మిరి :

స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నప్పుడు మోచేతిని ఎక్కువగా వంచడం వల్ల ఇది సంభవించవచ్చు. మోచేతిని ఎక్కువగా మడత పెట్టడం వల్ల, చేతికి రక్తప్రసరణ తగ్గి తిమ్మిరి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా గంటలపాటు వాడుతూ ఫోన్లో మాట్లాడితే ఈ పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది.

 హ్యాండ్-ఆర్మ్ వైబ్రేషన్ సిండ్రోమ్ (HAVS):

మొబైల్ గేమ్‌లు ఆడుతూ ఎక్కువసేపు గడిపే పిల్లలు హ్యాండ్-ఆర్మ్ వైబ్రేషన్ సిండ్రోమ్ (HAVS) అనే పరిస్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. పిల్లలు మొబైల్ ఉపయోగించినప్పుడు, చాలా గంటలు గేమ్స్ ఆడుతున్నప్పుడు చేతికి విపరీతమైన నొప్పి వస్తుంది. అప్పుడు ఈ హ్యాండ్ ఆర్మ్ వైబ్రేషన్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది.

కీళ్ళపై ఒత్తిడి:

ఇది చేయి, మణికట్టులో నొప్పి, జలదరింపు, తిమ్మిరికి కారణమవుతుంది. అతిగా స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది.

ఇక ఏదైనా అతిగా చేస్తే ఆరోగ్యానికి అంత మంచిది కాదని, నిపుణులు ఎప్పటినుంచో హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆ కోవలోకి వచ్చింది స్మార్ట్ ఫోన్ ఉపయోగం. యువత విచ్చలవిడిగా స్మార్ట్ ఫోన్ వాడకం ద్వారా అనేక జబ్బులను ఆహ్వానిస్తున్నారు. నడివయసులోనూ ముదుసలి వయస్సులోనూ రావాల్సిన జబ్బులు చిన్న వయస్సులో రావడం గమనార్హం.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం