Lungs Healthy Diet: సిగరెట్టు మానలేకపోతున్నారా, అయితే ఫుడ్ తీసుకుంటే మీ లంగ్స్ ఇక భద్రం..!!
స్మోకింగ్...కొంతమందికి అలవాటుగా, మరికొందరికి ఫ్యాషన్‌గా మారింది. సరదాగా మొదలుపెట్టి..తమకు తెలియకుండానే వ్యసనపరులుగా మారుతున్నారు.

స్మోకింగ్…కొంతమందికి అలవాటుగా, మరికొందరికి ఫ్యాషన్‌గా మారింది. సరదాగా మొదలుపెట్టి..తమకు తెలియకుండానే వ్యసనపరులుగా మారుతున్నారు. స్మోకింగ్ బారిన పడి లక్షలాది మంది ప్రాణాలకే ముప్పు కొని తెచ్చుకుంటున్నారు. అయితే అలవాటుగా మారిని స్మోకింగ్ ను మానేసేందుకు ఎన్నో తంటాలు పడుతుంటారు. సిగరెటు, చుట్ట, బీడీలో ఉండే నికోటిన్ స్మోకింగ్ చేసే వారిని వ్యసనపరులుగా మారుస్తుంది. అందుకే ధూమపానికి ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా…మళ్లీ మళ్లీ తాగాలనే కోరిక కలుగుతుంది.
ఒకసారి అలవాటు చేసుకున్న ధూమపానం మానేయడం అంత సులువు కాదు. ఇది మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులపై చెడు ప్రభావం చూపుతాయి. దీంతో ఆస్తమా, బ్రాంకైటిస్, న్యుమోనియా, టీవీ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. ఊపరితిత్తులు ఆరోగ్యాంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయడంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం మీ ఊపిరితిత్తులను చాలా కాలాం పాటు ఆరోగ్యంగా ఉంచుతాయి. మీ లంగ్స్ ఆరోగ్యంగా ఉండాలంటే మీ డైట్ లో వీటిని చేర్చుకోండి.
వాల్‌నట్స్ :
అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ నుండి ప్రచురించబడిన ఒక జర్నల్ ప్రకారం, వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ కొన్ని వాల్ నట్స్ మీ డైట్ లో చేర్చుకున్నట్లయితే ఊపిరితిత్తుల సమస్య నుంచి బయటపడవచ్చు. ఇవి ఆస్తమాతో బాధపడేవారికి మేలు చేస్తుంది.
చేపలు:
చేపలు ఆరోగ్యానికి ఏంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. ఊపిరితిత్తులకు అధిక మొత్తంలో కొవ్వు ఉన్న చేప మేలు చేస్తుంది. చేపల్లో ఉండే ఒమేగా -3కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి.
బెర్రీలు:
బెర్రీస్ లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడేందుకు సహాయపడుతాయి. ఆహారంలో బెర్రీలను చేర్చుకున్నట్లయితే మీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి.
బ్రోకలి:
బ్రోకలిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో బ్రొకోలి ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఊపిరిత్తులను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు శరీర స్టామినాను పెంచడంలో సహాయపడుతుంది.
అల్లం:
అల్లం ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులను కాలుష్యం నుంచి రక్షిస్తాయి. అల్లం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వాయుమార్గాలు తెరచుకుని ఆక్సిజన్ ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. అల్లం ఊపిరితిత్తులకు ఎంతో మేలు చేస్తుందని ఇఫ్పటికే ఎన్నో అధ్యయనాలు రుజువు చేశాయి.
యాపిల్ :
రోజుకో యాపిల్ తింటే డాక్టర్ తో పని ఉండదని అందరికీ తెలిసిందే. రోజూ ఆపిల్ తింటే ఊపిరితిత్తులకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు లంగ్స్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. విటమిన్, ఇ, సి , బీటా కెరోటిన్, సిట్రస్ పండ్లు ఊపిరితిత్తులకు మంచివని ఓ పరిశోధనలో వెల్లడైంది.
అవిసెగింజలు:
అవిసెగింజలను రెగ్యులర్ డైట్లో చేర్చుకుంటే ఊపిరితిత్తులు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడేవారు అవిసెగింజలను ఆహారంలో చేర్చుకుంటే నయం అవుతుందని ఓ పరిశోధనలో తేలింది.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం



