Health: ముక్కుదిబ్బడతో గాలి పీల్చు కోలేకపోతున్నారా.? ఈ సింపుల్ టిప్స్ పాటించండి.. మంచి ఫలితం ఉంటుంది.
Health: అసలే చలికాం, కాసేపు చల్లగాలికి వెళ్లినా వెంటనే జలుబు పట్టుకుంటుంది. అయితే ఒక్కసారి జలుబు అయ్యిందంటే కనీసం వారం రోజులైనా ఉంటుంది. ఎన్ని రకాల ట్యా్బ్లెట్లు వాడినా ఓ పట్టున జలుబు తగ్గదు. ఇక జలుబు కారణంతో..
Health: అసలే చలికాం, కాసేపు చల్లగాలికి వెళ్లినా వెంటనే జలుబు పట్టుకుంటుంది. అయితే ఒక్కసారి జలుబు అయ్యిందంటే కనీసం వారం రోజులైనా ఉంటుంది. ఎన్ని రకాల ట్యా్బ్లెట్లు వాడినా ఓ పట్టున జలుబు తగ్గదు. ఇక జలుబు కారణంతో ముక్కుదిబ్బ సమస్య ఏర్పడుతుంది. ఈ కారణంగా గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా మారుతుంది. రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టదు. అయితే కొన్ని నేచురల్ టిప్స్‌ను పాటించడం వల్ల ముక్కు దిబ్బడ సమస్యకు చెక్ పెట్టవచ్చని మీకు తెలుసా.? అలాంటి కొన్ని చిట్కాలపై ఓ లుక్కేయండి..
* ముక్కు దిబ్బడ సమస్యతో బాధపడుతుంటే ఆరెంజ్ జ్యూస్‌ను తీసుకోవాలి. ఇలా చేస్తే ఈ సమస్య నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఆరెంజ్ జ్యూస్‌లో ఉండే విటమిన్-సి ఈ సమస్యకు చెక్‌పెట్టడంలో ఉపయోగపడుతుంది.
* ముక్కు దిబ్బడ ఉంటే పాలు, పాల ఉత్పత్తులను తగ్గించడం మంచిది. ఎందుకంటే.. పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల మన ముక్కులో అధిక మొత్తంలో శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. కనుక ఈ సమస్యతో బాధపడేవారు పాల ఉత్పత్తులను కొన్ని రోజులపాటు తగ్గించాలి.
* ఈ సమస్య ఉన్న సమయంలో వేడి వేడి సూప్‌లను తీసుకోవాలి. ముఖ్యంగా కారం ఎక్కువగా ఉండేలాంటి సూప్‌లను తీసుకుంటే ముక్కులో శ్లేష్మం ఉత్పత్తిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దీంతో వెంటనే ముక్కు దిబ్బడ సమస్యకు చెక్ పడుతుంది.
* ముక్కుదిబ్బడ సమస్యకు వెంటనే చెక్ పెట్టాలంటే పెప్పర్‌మెంట్ ఆయిల్‌ను బాగా మరుగుతున్న నీటిలో వేసి ఆవిరి పట్టాలి. దీంతో ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
* సోంపు, గడ్డి చామంతి, గ్రీన్ టీ, బ్లాక్ టీ వంటి టీలను తీసుకోవడం ద్వారా ముక్కుదిబ్బడ సమస్య నుంచి బయటపడొచ్చు. వీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ముక్కు దిబ్బడ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి.