Vivo Diwali Offer: దీపావళి పండగ సీజన్‌లో వివో అదిరిపోయే ఆఫర్.. రూ.101లకే స్మార్ట్‌ఫోన్ సొంతం.. ఎలాగంటే..
Vivo Diwali Offer : దీపావళి పండగకు పలు మొబైల్ సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. వినియోగదారులను..
Vivo Diwali Offer : దీపావళి పండగకు పలు మొబైల్ సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కస్టమర్ల ఆకర్షించేందుకు ఇప్పటికే పలు ఆఫర్లు ప్రకటించగా, తాజాగా వివో కూడా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫెస్టివ్ సీజన్ సందర్భంగా భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. రూ. 101కే ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చని వెల్లడించింది. అయితే.. దీని కోసం పలు షరతులు విధించింది.
ముందుగా రూ.101 చెల్లించి..
బజాజ్ ఫైనాన్స్‌తో జతకట్టింది. బజాజ్ కస్టమర్లు సొంతం చేసుకొనే వీలుంది. అయితే రూ.15 వేల కంటే.. ఎక్కువ ధర ఉన్న వివో ఫోన్లను ముందుగా 101 రూపాయలు చెల్లించి తీసుకోవచ్చని, ఆ తర్వాత నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌తో నెలనెలా ఈఎంఐ పద్దతుల్లో చెల్లించే సౌకర్యం కలిగిస్తోంది. వివో వై73, వివో వీ 21 రేంజ్, వివో వై33ఎస్, వివో ఎక్స్ 70 సిరీస్ స్మార్ట్ ఫోన్‌లపై ఈ ఆఫర్లు లభించనున్నాయి.
వివో ఎక్స్ 70 సిరీస్ కొనాలంటే..
ఐసీఐసీఐ బ్యాంకు సిటీ బ్యాంకు, కొటాక్ మహీంద్ర బ్యాంకు, హెడీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మరో విషయం వివో ఫోన్లపై ఈ ఆఫర్లను పొందాలంటే వివో ఇండియా స్టోర్‌లో మొబైల్‌లను కొనుగోలు చేయాల్సి ఉంటుందని, లేదా ఈ కామర్స్ సైట్లలో ఈ ఆఫర్లపై కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఆఫర్ నవంబర్ 07 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.
ఇవి కూడా చదవండి: