Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sukanya Samruddhi Yojana: అదిరిపోయే స్కీమ్‌.. నెలకు రూ.12,500 డిపాజిట్‌తో రూ. 70 లక్షల బెనిఫిట్‌..!

Sukanya Samruddhi Yojana: ప్రస్తుతం ఆదాయం పెంచుకునే పథకాలు ఎన్నో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల స్కీమ్‌లను..

Sukanya Samruddhi Yojana: అదిరిపోయే స్కీమ్‌.. నెలకు రూ.12,500 డిపాజిట్‌తో రూ. 70 లక్షల బెనిఫిట్‌..!
Follow us
Subhash Goud

| Edited By: Surya Kala

Updated on: Oct 29, 2021 | 3:32 PM

Sukanya Samruddhi Yojana: ప్రస్తుతం ఆదాయం పెంచుకునే పథకాలు ఎన్నో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక కేంద్ర ప్రవేశపెట్టిన పథకాలలో సుకన్య సమృద్ది (ఎస్‌ఎస్‌వై) యోజన స్కీమ్‌ ఒకటి. ఈ పథకం అనేది ఆడ పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించినది. భారత ప్రభుత్వం బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా 2015లో ప్రారంభించింది. ఇది దీర్ఘకాలిక పొదుపు ప‌థ‌కం. ఆడ పిల్లల భవిష్యత్తుకు ఆర్థిక భరోసాగా ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉన్నత విద్య, వివాహ సమయాల్లో ఈ స్కీమ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ పథకానికి ఎవ‌రు అర్హులు?

ఆడ పిల్ల పుట్టిన తర్వాత నుంచి ఆమెకు పదేళ్ల వయసు వచ్చే లోపు ఎప్పుడైన ఈ స్కీమ్‌ కింద బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో ఖాతా తెరవవచ్చు. అయితే ఈ పథకంలో ఆమె చేరాలంటే ఖచ్చితంగా భారతీయురాలై ఉండాలి. తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు రెండు ఖాతాలు తెరిచేందుకు మాత్రమే వీలుంది. రెండోసారి పుట్టిన పిల్లలు కవలలైనా లేదా మొదటి సారి ముగ్గురు పిల్లలు జన్మించినా మూడోది తెరిచేందుకు అనుమతి ఇస్తారు. ఇందుకోసం వైద్యప‌ర‌మైన ప‌త్రాలు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. దత్తత తీసుకున్న బాలిక పేరు పై కూడా ఈ ఖాతా తెరిచేందుకు సౌకర్యం ఉంది. అయితే ఒక‌రి కోసం రెండు ఖాతాలను తీసుకునేందుకు వీలు ఉండదు. బాలిక ప‌దేళ్ల వ‌య‌సు నుంచి ఖాతాను నిర్వహించుకోవచ్చు.

ధృవీకరణ పత్రాలు..

ఈ ఖాతా తెరిచేందుకు వ్యక్తిగత గుర్తింపు పత్రం, చిరునామ, పత్రాలతో పాటు జనన ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన బ్యాంకులు, పోస్టాఫీసుల్లో తెరవవచ్చు. ఈ స్కీమ్‌ మెచ్యూరిటీ గడువు 21 సంవత్సరాలు. ఉదాహారణకు చెప్పాలంటే 8 సంవత్సరాలు వయసున్న బాలికపై ఖాతాను ప్రారంభిస్తే అమ్మాయి 29 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మెచ్యూరిటీ పూర్తవుతుంది. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌ అమ్మాయికి 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత డబ్బులు తీసుకునే వీలుంటుంది.

ఒక ఆర్ధిక సంవత్సరం అంటే ఏప్రిల్1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు అని అర్ధం. అకౌంట్‌ను ప్రారంభించేందుకు కనీస డిపాజిట్ రూ.250 అవ‌స‌రం . ఏడాదికి కనీసం రూ.250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఏడాదికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్‌ చేయవచ్చు. అంతకు మించి డిపాజిట్‌ చేయరాదు. అకౌంట్‌ తెరిచిన ఏడాది నుంచి 14 సంవత్సరాల పాటు డిపాజిట్‌ చేయవచ్చు. ఒక వేళ మీకు ఇద్దరు అమ్మాయిలు ఉంటే మీరు రెండు ఖాతాలలో మొత్తం రూ.3 లక్షల వరకు డిపాజిట్‌ చేసుకోవచ్చు.

ఎలా డిపాజిట్ చేయవచ్చు..

అలాగే నగదు లేదా చెక్కు లేదా డిమాండ్‌ డ్రాఫ్ట్‌ (డీడీ) రూపంలో కూడా డబ్బులను డిపాజిట్‌ చేయవచ్చు. అలాగే డిపాజిట్ మొత్తాన్ని ఒకేసారి లేదా వాయిదాలలో చెల్లించవచ్చు. అలాగే ఒక నెల లేదా ఒక ఆర్ధిక సంవత్సరంలో ఎన్ని సార్లు అయినా డిపాజిట్ చేయవచ్చు. ఒకవేళ ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో కనీస మొత్తం డిపాజిట్ చేయకపోతే ఖాతాను డిఫాల్ట్ అకౌంట్‌గా పరిగణిస్తారు. ఖాతాను తిరిగి పునరుద్ధరించుకోడానికి డిపాజిట్ మొత్తంతో పాటు రూ.50 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ. లక్షా 50 వేలకంటే ఎక్కువ మొత్తాన్ని జమ చేసినట్లయితే ఖాతాదారుడు అదనపు మొత్తాన్ని ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అదనపు మొత్తంపై ఎలాంటి వడ్డీ చెల్లించరు.

వడ్డీ రేటు:

ప్రస్తుతం వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంది. ఇది ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ప్రభుత్వ స్కీమ్‌లపై వర్తించే వడ్డీ రేట్లు కంటే ఎక్కువగా ఉంటుంది. అకౌంట్‌ తెరిచిన రోజు నుంచి 15 సంవత్సరాల పాటు నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన డిపాజిట్లు చేయవచ్చు. ఆడ పిల్లకు 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత లేదా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే మీరు ఖాతాలో డబ్బును ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.

అయితే ఈ ఖాతాలో ప్రతి నెల 10 వ తేది కంటే ముందు న‌గ‌దు డిపాజిట్ చేస్తే నెలంత‌టికీ వ‌డ్డీ ల‌భిస్తుంది. ప్రతినెల 10 వ తేదీ నుంచి చివ‌రి వ‌ర‌కు ఉన్న త‌క్కువ న‌గ‌దుపై వ‌డ్డీ లెక్కిస్తారు. అందుకే 10 వ తేదీకంటే ముందే డిపాజిట్ చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ స్కీమ్‌పై వడ్డీ రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అందుకే ఏ బ్యాంకులో ఖాతాను ప్రారంభించినా ఒకే విధంగా వడ్డీ రేట్లు ఉంటాయని గుర్తించుకోవాలి. మెచ్యూరిటీ తీరిన తర్వాత కూడా అంటే 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఖాతాలోని మొత్తాన్ని ఉపసంహరించుకోకపోతే, దానిపై వడ్డీని చెల్లించరు.

సుకన్య సమృద్ధి యోజన పథకానికి 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తుంది అనుకుంటే.. సంవత్సరానికి రూ.1000 కనీస పెట్టుబడి15 సంవత్సరాల పాటు పెట్టినట్లయితే, 21 సంవత్సరాల పూర్తయిన తర్వాత అంటే మెచ్యూరిటీ సమయంలో రూ. 46,800 పొందవచ్చు. అలాగే ఏడాదికి రూ. 1,50,000 కనీస పెట్టుబడి15 సంవత్సరాల పాటు పెట్టినట్లయితే, 21 సంవత్సరాల తరువాత రూ. 70,20,000 తీసుకోవచ్చు.

ఏడాదికి ఎంత డిపాజిట్‌ చేస్తే అమ్మాయికి 21 ఏళ్లు నిండిన తర్వాత ఎంత వస్తుందంటే..

► ఏడాదికి రూ.1000 డిపాజిట్‌ చేసినట్లయితే 21 ఏళ్ల తర్వాత 46,800 వస్తుంది.

► రూ.2000 డిపాజిట్‌ చేస్తే రూ. 93,600

► రూ.5000 డిపాజిట్‌ చేస్తే రూ.2,34000

► రూ. 10 వేలు డిపాజిట్‌ చేస్తే రూ.4,68000

► రూ. 20 వేలు డిపాజిట్‌ చేస్తే రూ.9,36000

► రూ.50 వేలు డిపాజిట్‌ చేస్తే రూ.23,40000

► రూ.1,00,000 డిపాజిట్‌ చేస్తే రూ.46,80000

► రూ.1.50,000 డిపాజిట్‌ చేస్తే రూ.70,20000 మొత్తాన్ని అందుకోవచ్చు.

ఇలా ఏడాది కాలానికి డిపాజిట్‌ చేసిన మొత్తానికి 21 ఏళ్ల తర్వాత ఇంత మొత్తాన్ని అందుకోవచ్చన్నమాట.

ఇవి కూడా చదవండి:

Jeevan Pramaan: పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌.. ఆన్‌లైన్‌లో జీవన్‌ ప్రమాణ్‌ సర్టిఫికేట్‌ సబ్‌మిట్‌ చేయండలా..!

Aadhaar-Ration Card Link: మీ రేషన్‌ కార్డుకు ఆధార్‌ నెంబర్‌ లింక్‌ చేశారా? సులభమైన ఈ మూడు పద్దతుల్లో చేసుకోండి