- Telugu News Photo Gallery Business photos 2021 Bajaj Pulsar 250 Launched, With Two Variants Price Starts At Rs 1.38 Lakh
Bajaj Pulsar 250: బజాజ్ పల్సర్ 250లో రెండు వేరియంట్లు.. ఫీచర్స్, ధర వివరాలు..!
Bajaj Pulsar 250: ప్రస్తుతం టెక్నాలజీనితో కూడిన కొత్త కొత్త బైక్‌లు మార్కెట్లో విడుదలవుతున్నాయి. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునే విధంగా వాహనతయారీ కంపెనీలు కూడా..
Updated on: Oct 29, 2021 | 3:52 PM

Bajaj Pulsar 250: ప్రస్తుతం టెక్నాలజీనితో కూడిన కొత్త కొత్త బైక్‌లు మార్కెట్లో విడుదలవుతున్నాయి. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునే విధంగా వాహనతయారీ కంపెనీలు కూడా కొత్త కొత్త ఫీచర్స్‌ను జోడిస్తూ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.

ఇక తాజాగా బజాజ్ ఆటో పల్సర్ 250 బైక్‌లో ఆర్250, ఎన్250 అనే రెండు సరికొత్త వేరియంట్లను గురువారం మార్కెట్లో విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ బైక్‌లలో అత్యాధునిక టెక్నాలజీని వాడి మరిన్ని ఫీచర్స్‌ను జోడించింది కంపెనీ. వీటి ధరలు వరుసగా రూ.1.40 లక్షలు, రూ.1.38 లక్షలు (ఎక్స్-షోరూమ్, దిల్లీ). దేశీయ మార్కెట్లో 2001 అక్టోబరులో స్పోర్ట్ బైక్ పల్సర్‌ను బజాజ్ ఆటో పరిచయం చేసింది.

0.25 లీటర్ 250 సీసీ బీఎస్6 డీటీఎస్-ఐ, ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తున్న కొత్త బైక్‌లతో పల్సర్ పోర్ట్‌ఫోలియో మరింత ఆకర్షణీయం కానుందని బజాజ్ ఆటో కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ వెల్లడించారు. 50 దేశాల్లో పల్సర్‌కు విశేష ఆదరణ లభిస్తోందని చెప్పారు.





























