Stress Relaxation: మానసిక ఒత్తిడితో కుంగిపోతున్నారా?.. అయితే ఇలా చేయండి.. ఆరోగ్యంగా ఉండండి..

Stress Relaxation Techniques: మానసిక ఒత్తిడిని ఎదుర్కోవటం.. దానిని ఎదుర్కోవటానికి పరిష్కార మార్గాలను కనుగొనడం? ఒత్తిడిని జయించడానికి..

Stress Relaxation: మానసిక ఒత్తిడితో కుంగిపోతున్నారా?.. అయితే ఇలా చేయండి.. ఆరోగ్యంగా ఉండండి..
Stress
Follow us

| Edited By: Phani CH

Updated on: Jun 10, 2021 | 9:08 AM

Stress Relaxation Techniques: మానసిక ఒత్తిడిని ఎదుర్కోవటం.. దానిని ఎదుర్కోవటానికి పరిష్కార మార్గాలను కనుగొనడం? ఒత్తిడిని జయించడానికి అవసరమైనవి పాటించడం ప్రతీ ఒక్కరికి చాలా అవసరం అయితే, ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరిలోనూ భిన్నంగా ఉంటుంది. జీవితంలో చోటుచేసుకుంటున్న పరిణామాల ఆధారంగా ఒత్తిడి వర్గీకరించడం జరుగుతుంది. ఉద్యోగం చేసే చోట పరిస్థితులు, వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థికపరైన ఇతర కారణాల వల్ల మనుషులు ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు. ఫలితంగా నిద్రలేమి వంటి సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. అయితే చాలా మంది ఈ ఒత్తిడి భరించలేక.. ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు కోకొల్లలు. అందుకే ఒత్తిడిని జయించటానికి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రస్తుత కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన ఆరోగ్య సమస్యల్లో ఒకటి మానసిక ఒత్తిడి. ఈ ఒత్తిడి కారణంగా అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు. ఒత్తిడి కారణంగా గుండె జబ్బులు, రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యం తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం, జుట్టు రాలిపోవడం, నిద్రలేమి, జీర్ణ సంబంధిత సమస్యలు ఇలా అనేక రకాల సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఈ ఒత్తిడికి అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్ట్రెస్ వివరణ ఇచ్చింది. ‘శారీరక, మానసిక లేదా భావోద్వేగ ఒత్తిడి లేదా ఉద్రిక్తత’ అని అభివర్ణించింది.

ఒత్తిడిని ఎలా జయించాలంటే.. 1. మీరు ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి ఇతరులతో పంచుకోండి. మీరు స్ట్రెస్ ‌గా ఎందుకు ఫీల్ అవుతున్నారు అనేదాని గురించి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులతో చర్చించండి. ఒత్తిడితో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండకుండా అందరితో కలివిడిగా తిరగండి. సరదాగా మాట్లాడంటి. ఇతరుల పట్ల ప్రేమను చూపుతూ నిత్యం చిరునవ్వుల చిందిస్తూ ఉండండి. 2. మీ జీవన శైలి గురించి, మీ దిన చర్య గురించి చుట్టూ ఉన్నవారితో చర్చించండి. అవసరమైన మార్పులు చేసుకోండి. 3. ఆరోగ్యకరమైన జీవనం, ఆరోగ్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని డెవలప్ చేసుకోవడంపై దృష్టి సారించండి. ఒ లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యం దిశగా పయనించండి. 4. వ్యాయామం క్రమం తప్పకుండా చేయండి. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి.. ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. 5. స్వీయ రక్షణ గురించి ఆలోచించండి. మీకు నచ్చిన పనిని చేయండి. సమయానికి తినడం, సమయానికి వ్యాయామం చేయడం, తగినంత సమయం నిద్రపోవడం చేయాలి. 6. మీవల్ల కాని, మీరు నియంత్రించలేని పరిస్థితుల గురించి ఆలోచించడం మానేయండి. 7. మీలోని నెగెటీవ్ ఆలోచనలను నియంత్రించుకోండి. మనస్సును ఎప్పుడూ ప్రశాంతంగా, మీ నియంత్రణలో ఉంచుకోవడంపై దృష్టి సారించండి. 8. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేయండి. ముఖ్యంగా మద్యానికి దూరంగా ఉండండి. మీ లైఫ్‌కి విలువ ఇవ్వడం నేర్చుకోండి.

Also read:

Yoga Asanas: కోవిడ్ తగ్గినా నీరసంగా ఉందా?.. అయితే ఈ యోగాసనాలు ట్రై చెయ్యండి..