Yoga Asanas: కోవిడ్ తగ్గినా నీరసంగా ఉందా?.. అయితే ఈ యోగాసనాలు ట్రై చెయ్యండి..

Yoga Asanas: రోగనిరోధక శక్తిని పెంచడం నుండి శరీరంలోని ముఖ్యమైన అవయవాల పనితీరును మెరుగుపరచడం వరకు, ఒత్తిడిని తగ్గించడం..

Yoga Asanas: కోవిడ్ తగ్గినా నీరసంగా ఉందా?.. అయితే ఈ యోగాసనాలు ట్రై చెయ్యండి..
Yoga
Follow us

|

Updated on: Jun 10, 2021 | 6:03 AM

Yoga Asanas: రోగనిరోధక శక్తిని పెంచడం నుండి శరీరంలోని ముఖ్యమైన అవయవాల పనితీరును మెరుగుపరచడం వరకు, ఒత్తిడిని తగ్గించడం నుండి నిరాశను తగ్గించడం వరకు, మీరు సరైన ఆసనాలను ఎంచుకుని, అవగాహనతో సాధన చేస్తే యోగా ప్రధాన పాత్ర పోషిస్తుంది.

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతోంది. ఫలితంగా రోజు రోజుకు లక్షలాది మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. అయితే, వీరిలో కొందరు కోలుకుంటుండగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. కారణం రోగనిరోధక వ్యవస్థ బలంగా లేకపోవడం. అయితే, కోవిడ్ నుంచి కోలుకున్న వారిలోనూ చాలా మంది అనేక అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. అయితే, పోస్ట్‌ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు యోగా ద్వారా త్వరగా రికవరీ అవ్వొచ్చని చెబుతున్నారు. ఢిల్లీకి చెందిన ది పింక్ లోటస్ అకాడెమియా, భారతీయ క్లాసికల్ ఆర్ట్ ఆర్మ్స్ యోగా ప్రాముఖ్యతను వివరిస్తున్నాయి. యోగా శిక్షణ కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ తరగతులనునిర్వహిస్తున్నాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో, శరీరాన్ని, మనస్సును ఏకం చేయడంలో ఉపకరించే ఆసనాలను వివరిరిస్తున్నారు.

యోగా.. శారీరక, మానసిక సమస్యలకు పరిష్కారాలను చూపుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు.. శరీరంలోని ముఖ్యమైన అవయవాల పనితీరును మెరుగు పరుస్తుంది. అలాగే ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకోసం యోగాలో ప్రత్యేకమైన ఆసనాలు ఉన్నాయి. ఈ ఆసనాలు శారీరక, మానసిక శక్తిని పెంపొందించడంలో ఎంతగానో ఉపకరిస్తాయి.

దండాసన.. (staff pose) ఈ ఆసనం శరీరానికి చాలా ప్రయోజనాలు కల్పిస్తుంది. ఇది భుజాలు మరియు ఛాతీని విస్తరించి, వెన్నెముక కండరాలను ధృడంగా మారుస్తుంది.

సీతాకోకచిలుక భంగిమ..(Butterfly pose) ఈ ఆసనం తొడ కండరాలు, గజ్జలు, మోకాళ్ల సమస్యలను తగ్గిస్తుంది. ఎక్కువ గంటలు నిలబడి నడవడం వలన వచ్చే సమస్యలను తొలగిస్తుంది.

పావురం భంగిమ..(Pigeon pose) మీ తొడ, గజ్జ, వెన్నెముక భాగాన్ని సాగదీయడం ద్వారా, ఈ ఆసనం ఎక్కువసేపు కూర్చోవడం వలన కలిగే ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ ఆసనం చేయడం ద్వారా మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కాళ్లు, మెన్నెముక కండరాలను బలోపేతం చేస్తుంది.

పిల్లి మరియు ఆవు భంగిమ..(Cat and Cow pose) పిల్లి భంగిమను మార్చారియాసనం అంటారు. అలాగే ఆవు భంగిమను బిటిలాసన అని పిలుస్తారు. ఈ రెండు భంగిమలు శరీరాన్ని సాగదీయడానికి, ఒత్తిడిని తొలగించడానికి ఉపకరిస్తాయి. అలాగే కడుపు, వెన్నెముక భాగాలకు మసాజ్ చేసినట్లుగా అవుతుంది.

Also read:

Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. పెరగని ధరలు… దేశీయ మార్కెట్లో స్థిరంగా గోల్డ్ రేట్స్..