Health Care Tips: నిన్నటి కూరలను తింటున్నారా.. ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి!
సాధారణంగా నిన్న మిగిలిపోయిన కూరలను కానీ.. అన్నాన్ని కానీ చాలా మంది ఫ్రిజ్‌లో పెట్టుకుని మరుసటి రోజు తింటూ ఉంటారు. ఇది అందరూ చేసే పనే. కొద్దిగా మిగిలినా కూడా ఎందుకు పడేయడం అని ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తూ ఉంటారు. కొందరు వెంటనే తింటే.. మరి కొందరు మాత్రం రోజుల తరబడి స్టోర్ చేస్తూ ఉంటారు. అయితే పూర్వ కాలంలో మాత్రం ఈ సదుపాయం ఉండేది కాదు. ఎప్పటికప్పుడు వేడిగా వండుకుని తినేవారు. కానీ ఇప్పుడు వేరు. ఇప్పుడు ఉండే సదుపాయాలు కూడా వేరు. ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా రెండు..

సాధారణంగా నిన్న మిగిలిపోయిన కూరలను కానీ.. అన్నాన్ని కానీ చాలా మంది ఫ్రిజ్‌లో పెట్టుకుని మరుసటి రోజు తింటూ ఉంటారు. ఇది అందరూ చేసే పనే. కొద్దిగా మిగిలినా కూడా ఎందుకు పడేయడం అని ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తూ ఉంటారు. కొందరు వెంటనే తింటే.. మరి కొందరు మాత్రం రోజుల తరబడి స్టోర్ చేస్తూ ఉంటారు. అయితే పూర్వ కాలంలో మాత్రం ఈ సదుపాయం ఉండేది కాదు. ఎప్పటికప్పుడు వేడిగా వండుకుని తినేవారు. కానీ ఇప్పుడు వేరు. ఇప్పుడు ఉండే సదుపాయాలు కూడా వేరు. ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా రెండు, మూడు రోజులకు సరిపడా ఒకటేసారి వండుకుని వేడి చేసుకుని తింటున్నారు. కానీ ఇలా కూరలు నిల్వ చేసుకుని తినడం మంచిదేనా? నిపుణులు ఏం అంటున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్రిజ్‌లో స్టోర్ చేసిన కూరలు తినడం వల్ల ఎలాంటి హాని కలుగదు..
మిగిలిన కూరలు కానీ అన్నం కానీ బయట ఉంచితే సమయం గడిచే కొద్దీ పాడైపోతాయి. ఒక్కోసారి ఉదయం వండిని సాయంత్రానికే వాసన వస్తూ ఉంటాయి. దీనికి కారణం వాటిపై బ్యాక్టీరియా చేరి.. వాటికి అనుగుణంగా మార్చుకుంటాయి. దీంతో కూరలు పాడైపోతాయి. కానీ ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల రెండు రోజులు అయినా పాడవదు. అలాగే ఫ్రిజ్‌లో స్టోర్ చేసిన కూరలు తినడం వల్ల ఎలాంటి హాని కలుగదు. వాటిపై బ్యాక్టీరియా చేరినా ఎలాంటి నష్టం ఉండదు.
ఫ్రిజ్‌లో ఉంచిన కూరలపై బ్యాక్టీరియా చేరినా.. కూరలు పాడయ్యే ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. వీటిని తిన్నా ఎలాంటి ప్రమాదం ఉండదు. మరి కూరలు తినడం వల్ల ఎలాంటి హాని కలుగదా.. అని డౌట్ రావొచ్చు. ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన కూరలు తినడం వల్ల ఎలాంటి హాని కలుగదని నిపుణులు చెబుతున్నారు. ఆ బ్యాక్టీరియాను తట్టుకునే వక్తి ఏర్పడుతుందని చెబుతున్నారు. ఇలా నిల్వ చేసిన కూరలను తినడం వల్ల.. వీటిలో ఉండే బ్యాక్టీరియా.. పొట్టలో ఉండే బ్యాక్టీరియాని నశింపజేస్తుంది. దీంతో నిల్వ ఉంచిన కూరలను తిన్నా.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
కూరలు మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు..
అయితే ఫ్రిజ్‌లో పెట్టిన కూరలు ఒక పూట లేదా రోజులో తినాలి. లేదంటే వీటిలో ఉండే పోషకాలు అనేవి తగ్గిపోతాయి. అలాగే ఫ్రిజ్ లో నిల్వ చేసిన కూరలను ఒకసారి మాత్రమే వేడి చేసుకుని తినాలి. మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తింటే.. వాటిలో పోషకాలు తగ్గిపోవడమే కాకుండా.. శరీరానికి కూడా హాని కలుగుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.