Juice Side Effects: ఆరోగ్యం కోసం జ్యూస్, గ్రీన్ స్మూతీస్ మరీ ఎక్కువగా తాగుతున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్..

పండ్లు, కూరగాయలతో చేసిన జ్యూసులు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. జ్యూస్ ద్వారా శరీరానికి పోషకాలు చాలా అందుతాయి. అయితే జ్యూస్ లు, గ్రీన్ స్మూతీస్ తాగుతే ఆరోగ్యానికి హాని జరుగుతుందని ఎంతమందికి తెలుసు.

Juice Side Effects: ఆరోగ్యం కోసం జ్యూస్, గ్రీన్ స్మూతీస్ మరీ ఎక్కువగా తాగుతున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్..
Green Smoothies
Follow us
Madhavi

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 21, 2023 | 10:59 AM

పండ్లు, కూరగాయలతో చేసిన జ్యూసులు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. జ్యూస్ ద్వారా శరీరానికి పోషకాలు చాలా అందుతాయి. అయితే జ్యూస్ లు, గ్రీన్ స్మూతీస్ తాగుతే ఆరోగ్యానికి హాని జరుగుతుందని ఎంతమందికి తెలుసు. తాగాల్సిన సమయంలోనే జ్యూస్ తాగితే..అందాల్సిన పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. సాధారణ కూరగాయలను ఉపయోగించి తయారు చేసిన గ్రీన్ జ్యూస్లు, స్మూతీస్ లతో అధిక స్థాయిలో కరిగే ఆక్సలేట్స్ ఉంటాయి. ఈ పానీయాల వినియోగం ఆక్సలేట్ కిడ్నీ స్టోన్ ఏర్పాడేందుకు కారణమవుతుందని పలు పరిశోధనలు వెల్లడించాయి.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్, తీవ్రమైన ఆక్సలేట్ నెఫ్రోపతీ చివరి దశ మూత్రపిండ వ్యాధికి దారి తీస్తుందని పరిశోధనలు వెల్లడించాయి.

స్మూతీస్ , గ్రీన్ జ్యూస్ ఎలా ప్రమాదకరం?

ప్రతిరోజూ ఉదయం స్మూతీస్ లేదా గ్రీన్ జ్యూస్ లు తీసుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతుంటారు. స్మూతీల్లో, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు నిండి ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే మోతాదుకు మించి ఖనిజాలు, ఇతర సమ్మేళనాలు తీసుకోవడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని హెచ్చరిస్తున్నారు.

గ్రీన్ జ్యూస్‌లు, స్మూతీస్‌లో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. బచ్చలికూర, చార్డ్, డాండెలైన్ ఆకుకూరలు, దుంపలు, కొల్లార్డ్ గ్రీన్స్, బెర్రీలు, బ్రోకలీ, క్యాబేజీ, క్యారెట్‌లలో ఆక్సలేట్లు ఎక్కువగా లభిస్తాయి. కొంతమందిలో, ఆక్సలేట్లు శరీర కణజాలాలలో పేరుకుపోయి..శరీరంలో మంటను రేకెత్తిస్తాయి. ఆక్సలేట్ శరీరంలో ఎక్కువగా చేరడం వల్ల, దీర్ఘకాలిక నొప్పి, మూత్రపిండాల్లో రాళ్లు, నాడీ సంబంధిత లక్షణాలు, వల్వార్ నొప్పి, ఫైబ్రోమైయాల్జియా నొప్పితో వంటి సమస్యలను తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.

స్మూతీస్, జ్యూస్‌లు తాగేటప్పుడు కిడ్నీ దెబ్బతినకుండా ఎలా నివారించాలి:

మీకు ఇష్టమైన స్మూతీస్‌ను తాగాలనుకున్నప్పుడు తీసుకోవల్సిన కొన్ని దశలు ఉన్నాయి చూద్దాం:

– కిడ్నీలకు అనుకూలంగా ఉండే స్మూతీస్ లేదా జ్యూస్ లు తాగాలి.

-సమతుల్య స్మూతీని తయారు చేయడానికి బెర్రీలు వంటి పొటాషియం తక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలి. స్మూతీస్ లో బచ్చలికూరను తీసుకోవడం మానుకోండి. ఎందుకుంటే ఇందులో ఆక్సిలేట్ 650ఎంజీ ఉంటుంది. ఇది కిడ్నీని ప్రభావితం చేస్తుంది. పాల ఉత్పత్తుల సంఖ్యను తగ్గించండి.

– మీరు ఆకుకూరల రసాన్ని జోడించవచ్చు. ఎందుకంటే ఇది మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది. మంచి మొత్తంలో కాల్షియం తీసుకోండి.

-స్మూతీస్, జ్యూస్‌లను తీసుకునేటప్పుడు మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి మీ కాల్షియం తీసుకోవడం పెంచండి.

-విటమిన్ డి-రిచ్ ఫుడ్స్‌తో కూడిన కాల్షియం-రిచ్ డైట్ మీ ప్రేగులలోని చాలా ఫాస్ఫేట్, ఆక్సలేట్‌లను తొలగించడంలో సహాయపడుతుంది.

– ఉప్పు తగ్గించండి.

– ఆహారంలో సోడియం తీసుకోవడం పరిమితం చేయడం వల్ల మీ కిడ్నీలు అనారోగ్యం లేకుండా ఉంచుకోవచ్చు. మీ రోజువారీ ఉప్పును 2-3 గ్రాములకు పరిమితం చేయాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.

-రోజూ 3-5 లీటర్ల నీరు తాగడం వల్ల ఆక్సలేట్ లేదా ఫాస్ఫేట్ ఎక్కువగా ఉన్న స్మూతీస్ తీసుకునే వారికి కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించవచ్చు.

-మీ మూత్రపిండాలలో కాల్షియం ఫాస్ఫేట్ లేదా ఆక్సలేట్ స్ఫటికాలు అభివృద్ధి చెందకుండా నిరోధిస్తుంది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ చదవండి