AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Six Pack Body: ఇంట్లోనే ఇలా చేశారంటే.. నెల రోజుల్లో సిక్స్ ప్యాక్ బాడీ మీ సొంతం.. నమ్మట్లేదా..?

జిమ్‌కి వెళ్లి వ్యాయామాలు, వర్కౌట్లు చేయడం మంచిదే, కానీ గంటల కొద్దీ సమయం జిమ్‌లో గడపడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. గుండెపోటు, గాయాలు కావడం..

Six Pack Body: ఇంట్లోనే ఇలా చేశారంటే.. నెల రోజుల్లో సిక్స్ ప్యాక్ బాడీ మీ సొంతం.. నమ్మట్లేదా..?
Six Pack
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 21, 2023 | 10:57 AM

Share

స్వతహాగానే బాడీ ఫిట్‌నెస్ కోసం జిమ్‌కి వెళ్లి లేదా ఇంట్లోనే వ్యాయామాలు చేస్తుంటారు కొంతమంది. అయితే బాడీ ఫిట్‌నెస్ అనేది హుందాతనంగా, గొప్పగా చూయించుకోవాలని వ్యాయామాలు, డైట్లు అనుసరించేవారు ఇంకొంతమంది. ఎవరు ఎలా చేసినా అందరూ కోరుకునేది బాడీ ఫిట్‌నెస్‌నే కదా.. అయితే ముఖ్యంగా సిక్స్ ప్యాక్ కోసమే వ్యాయామాలు చేసేవారి సంఖ్య చాలా ఎక్కువగా మొత్తంలో ఉంటుంది. అందుకోసం జిమ్‌లో గంటల కొద్ది సమయాన్ని గడుపుతాయి. జిమ్‌కి వెళ్లి వ్యాయామాలు, వర్కౌట్లు చేయడం మంచిదే, కానీ గంటల కొద్దీ సమయం జిమ్‌లో గడపడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. గుండెపోటు, గాయాలు కావడం వంటి ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో నిపుణులు సూచించిన కొన్ని రకాల పద్ధతులను పాటిండం వల్ల సులభంగా  సిక్స్ ప్యాక్‌ పొందవచ్చు. అంతేకాకుండా  సమయాన్ని, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఇక నిపుణులు సూచిస్తున్నవాటిలో యోగా కూడా ఒకటి. యోగా మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగించడంతో పాటు శారీరక దృఢత్వాన్ని కూడా అందిస్తుంది. మరి సిక్స్ ప్యాక్ కోసం నిపుణులు సూచించిన యోగాసనాలేమిటో, వాటిలో ఎలా వేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

సిక్స్ ప్యాక్ కోసం వేయవలసిన ఆసనాలు:

హలాసనం: ప్రతి రోజూ హలాసనం వేయడం వల్ల ఉదర కండరాలు దృఢంగా తయారవుతాయి. అంతేకాకుండా  భుజాలుపై కండరాలు కూడా సులభంగా తయారవుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి సలభంగా సిక్స్ ఫ్యాక్‌ పొందడానికి ఈ ఆసనాన్ని ప్రతి రోజూ వేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

Halasana

హలాసనం ఎలా వేయాలంటే.. హలాసనాన్ని వేయడానికి.. చేతులను శరీరానికి పక్కగా పెట్టి వెనుకకు పడుకోవాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ, కాళ్ళను పైకి లేపి, వాటిని తలపైకి తీసుకురావాలి. ఇలా సుమారు 20-25 సెకన్ల పాటు చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.

నౌకాసనం: నౌకాసన యోగాసనం వెన్ను, పొత్తికడుపు కండరాలను బలోపేతం చేయడమే కాకుండా కాళ్లు, చేతుల కండరాలను టోన్ చేస్తుంది. అంతేకాకుండా కండరాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి శరీర ఆకృతిని పొందడానికి తప్పకుండా ఈ ఆసనం వేయాల్సి ఉంటుంది.

Naukasana

నౌకాసనం ఎలా వేయాంటే.. యోగా మ్యాట్‌పై మీ వెనుకభాగంలో పడుకుని, కాళ్లను ఒకచోట చేర్చి, చేతులతో కలపండి. తర్వాత మీ చేతులను మీ పాదాల వైపుకు విస్తరించేటప్పుడు మీ ఛాతీ, కాళ్ళను నేల నుంచి పైనకు లేపాల్సి ఉంటుంది. మీ శరీర బరువు పూర్తిగా మీ తుంటిపై తీసుకు రావాలి. ఇప్పుడు నిదానంగా శ్వాస వదులుతూ ఆసనం నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. ఇలా క్రమం ప్రతి రోజూ చేయాలి. ఇలా చేయడం వల్ల అనతి కాలంలోనే మీరు సిక్స్ ప్యాక్ బాడీని పొందగలరు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..