AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending: టెక్ బాబులూ మీ కోసమే.. ఇల్లు అద్దెకు కావాలంటే ఆ ప్రోఫైల్ ఉండాల్సిందే..

సాధారణంగా ఇల్లు అద్దెకు కావాలంటే.. ఇంటి ఓనర్ మనల్ని.. ఏం చేస్తుంటారు..? ఏ ఊరు..? ఎన్నాళ్లు ఉంటారు..? నెలనెలా అద్దె సమయానికి చెల్లించగలరా..? వంటి వివరాలనే..

Trending: టెక్ బాబులూ మీ కోసమే.. ఇల్లు అద్దెకు కావాలంటే ఆ ప్రోఫైల్ ఉండాల్సిందే..
Rent House in Bangalore
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 21, 2023 | 9:17 AM

Share

సిలికాన్ సిటీ బెంగళూరులో అద్దె ఇళ్లు, అపార్ట్‌మెంట్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు క్రమక్రమంగా ముగిసిపోతుండడంతో బెంగళూరులో అద్దె రేటు కూడా ఒక్కసారిగా పెరిగింది. అయినప్పటికీ బెంగళూరు టెక్ ఉద్యోగులకు అద్దె ఇల్లు దొరకడం చాలా కష్టంగా మారింది. ఇదిలా ఉండగా, అద్దె ఒప్పందాన్ని ఖరారు చేసే ముందు లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌ వివరాలు షేర్ చేయమని రెంటల్ బ్రోకర్ అడుగుతున్నారు. సాధారణంగా ఇల్లు అద్దెకు కావాలంటే.. ఇంటి ఓనర్ మనల్ని.. ఏం చేస్తుంటారు..? ఏ ఊరు..? ఎన్నాళ్లు ఉంటారు..? నెలనెలా అద్దె సమయానికి చెల్లించగలరా..? వంటి వివరాలనే అడుగుతారు. కానీ ఇప్పుడు లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ వివరాలు అడుగుతున్న క్రమంలో చాలా మంది తమ అనుభవాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఇక దీనికి సంబంధించిన పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

ఆ పోస్టులు టెక్ ఉద్యోగికి, రెంటల్ బ్రోకర్‌కి మధ్య జరిగిన చాట్ స్క్రీన్‌షాట్ ఫోటోలు. మార్చి 16న ఇద్దరు బ్రోకర్లతో వాట్సాప్ చాట్ చేసిన రెండు స్క్రీన్‌షాట్‌లను గౌతమ్ అనే ట్విట్టర్ ఖాతాదారుడు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇందిరా నగర్‌లో రెండు బీహెచ్‌కే ఇంటి కోసం వెతుకుతున్న గౌతమ్.. బ్రోకర్‌తో చాట్ చేశాడు. చాట్‌లో బ్రోకర్.. గౌతమ్‌ని లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ లింక్‌ను పంపమని అడిగాడు. తదనుగుణంగా గౌతమ్ తన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ను పంచుకున్నాడు. ఇంకో ఇంటి ఓనర్ గౌతమ్‌కి నీ గురించి(ఇంటర్య్వూ మాదిరిగా) ఏదైనా రాసి పంపు అన్నాడు. ఇక దీనికి సంబంధించిన చాట్ వివరాలు గౌతమ్ ట్విట్టర్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

గౌతమ్, రెంటల్ బ్రోకర్ చాట్ స్క్రీన్ ‌షాట్.. 

ఇక ఈ పోస్టుకు 900 లైక్‌లు, 50 రీట్వీట్లు మరియు 49 కామెంట్‌లు వచ్చాయి. మరికొందరు టెక్ ఉద్యోగులు కూడా గురుగ్రామ్‌లో తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను పంచుకున్నారు. గుర్గావ్‌లో అద్దెకు ఉండాలనకునేవారు కూడా ఓనర్‌కి తమ ప్రొఫైల్‌ను పంపాలి. మంచి జీతం రాకపోతే, ఉద్యోగం లేకపోతే ఇల్లు దొరకదని కొందరు.. స్టార్టప్ ఉద్యోగులకు కూడా ఇళ్లు దొరకడంలేదని లేదని మరికొందరు ట్వీట్ చేశారు.

కాగా, అంతకముందు IIT, IIM, ISB లేదా CAలో గ్రాడ్యుయేట్ కాదనే కారణంతో కూడా వేలూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్‌కు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఇంటి యజమాని నిరాకరించాడు. ఈ వార్త సోషల్ మీడియాలో చాలా సంచలనం సృష్టించింది. ఆ క్రమంలోనే కొందరు ఓనర్స్ అద్దెకు ఉండాలనుకునేవారి లింక్డ్ఇన్ ప్రొఫైల్ కోసం అడుగుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..