AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓర్నీ డబుల్ బొనాంజా అంటే ఇదే.. రక్తదానం చేస్తే మీ ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చు.. అదేలాగంటే..

రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి.. రక్తదానం చేయండి.. ప్రాణాలను కాపాడండి.. రక్తదానం మహాదానం.. ఆసుపత్రుల గోడలపై, బహిరంగ ప్రదేశాల్లో పెద్ద బ్యానర్లపై రాసి ఉండటం మీరు చూసి ఉంటారు. రక్తదానం చేయడం వల్ల మీకు కూడా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయని మీకు తెలుసా? తెలియకపోతే.. ఈ కథనాన్ని చదవండి..

ఓర్నీ డబుల్ బొనాంజా అంటే ఇదే.. రక్తదానం చేస్తే మీ ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చు.. అదేలాగంటే..
Blood Donation Benefites
Shaik Madar Saheb
|

Updated on: Apr 28, 2025 | 12:48 PM

Share

రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి.. రక్తదానం చేయండి.. ప్రాణాలను కాపాడండి.. రక్తదానం మహాదానం.. ఆసుపత్రుల గోడలపై, బహిరంగ ప్రదేశాల్లో పెద్ద బ్యానర్లపై రాసి ఉండటం మీరు చూసి ఉంటారు. రక్తదానం చేయడం అనేది ఇతరుల ప్రాణాలను కాపాడే ఒక గొప్ప కార్యం. కానీ రక్తదానం చేయడం వల్ల మీకు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయని మీకు తెలుసా? అవును.. రక్తదానం చేయడం వల్ల ఇతరుల ప్రాణాలను మాత్రమే కాకుండా.. మీ ప్రాణాలను కూడా కాపాడుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది.. రక్తదానం చేయడం ద్వారా ప్రమాదకరమైన రోగాలు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు.

క్రమం తప్పకుండా రక్తదానం చేయడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటి తీవ్రమైన సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి.

రక్తదానం చేయడం ద్వారా క్యాన్సర్‌ దూరం..

లండన్‌లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన అధ్యయనంలో సంవత్సరాలుగా క్రమం తప్పకుండా రక్తదానం చేస్తున్న వ్యక్తులకు లుకేమియా వంటి రక్త సంబంధిత క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని తేలింది. రక్తదానం చేయడం వల్ల శరీరం కొత్త రక్త కణాలను ఉత్పత్తి చేస్తుందని, తద్వారా ప్రమాదకరమైన ఉత్పరివర్తనల ప్రమాదాన్ని తగ్గిస్తుందని వివరించారు.

గుండెకు మేలు చేస్తుంది..

రక్తదానం చేయడం వల్ల రక్తం మందం తగ్గుతుంది.. ఇది రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే, ఇది శరీరంలో ఐరన్ స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది. అధిక ఇనుము శరీరంలో మంట, ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతుంది.. ఇది గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. అలా కాకుండా ఉండాలంటే.. రెగ్యులర్‌గా బ్లడ్ డొనేట్ చేయడం మంచిది..

డయాబెటిస్ ప్రమాదం తక్కువగా ఉంటుంది..

క్రమం తప్పకుండా రక్తదానం చేయడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుందని, ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని కొన్ని ప్రారంభ పరిశోధనలు సూచిస్తున్నాయి.

ఉచిత ఆరోగ్య తనిఖీ..

ప్రతిసారీ రక్తదానం చేసే ముందు, ఒక చిన్న ఆరోగ్య పరీక్ష జరుగుతుంది, దీనిలో రక్తపోటు, హిమోగ్లోబిన్, పల్స్ లాంటివి తనిఖీ చేస్తారు.. కొన్నిసార్లు కొన్ని తీవ్రమైన వ్యాధులను కూడా పరీక్షిస్తారు. దీనితో మీరు మీ ఆరోగ్యం గురించి నవీకరణలను పొందుతూనే ఉంటారు.

అయితే.. ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతి మూడు నెలలకొసారి రక్తాన్ని దానం చేయొచ్చు.. రక్తదానం ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..