AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: ఆయుర్వేదంతో డయాబెటిస్‌కు చెక్‌.. ఈ నాలుగు స్టెప్స్‌ ఫాలో అయితే చాలు..

Diabetes: మధుమేహం, డయాబెటిస్‌, షుగర్‌ వ్యాధి.. పేరు ఏదైనా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా భారత్‌లో షుగర్‌ పేషెంట్స్‌ ఎక్కువని..

Diabetes: ఆయుర్వేదంతో డయాబెటిస్‌కు చెక్‌.. ఈ నాలుగు స్టెప్స్‌ ఫాలో అయితే చాలు..
Narender Vaitla
|

Updated on: Jul 04, 2022 | 9:38 PM

Share

Diabetes: మధుమేహం, డయాబెటిస్‌, షుగర్‌ వ్యాధి.. పేరు ఏదైనా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా భారత్‌లో షుగర్‌ పేషెంట్స్‌ ఎక్కువని గణంకాలు చెబుతున్నాయి. అందుకే మధుమేహంలో భారతదేశం ప్రపంచ రాజధానిగా చెబుతుంటారు. ఇంటర్నేషనల్ డయాబెటిస్‌ ఫెడరేషన్‌ (IDF) ప్రకారం.. ప్రపంచంలో 463 మిలియన్ల మందికి, ఆగ్నేయాసియా ప్రాంతంలో 88 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ 88 మిలియన్ల మందిలో 77 మిలియన్లు భారతదేశానికి చెందినవారే కావడం విశేషం.

ఇదిలా ఉంటే డయాబెటిస్‌ చికిత్సకు ప్రస్తుతం ఎన్నో రకాల విధానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే టైప్‌1 డయాబెటిస్‌ నయం చేయడంలో ఆయుర్వేదం ముఖ్య పాత్ర పోషిస్తుందని ఢిల్లీలోని చౌదరి బ్రహమ్మ ప్రకాష్‌ ఆయుర్వేద్‌ చరక్‌ సంస్థాన్‌కు చెందిన డాక్టర్‌ పూజా సబర్వాల్‌ టీవీ9తో ప్రత్యేకంగా తెలిపారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. ‘రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఆయుర్వేదం సహాయం చేయడమే కాకుండా, గాయాలు, దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ల వంటి చర్మ సమస్యలకు నివారణ ఉంటుంది. షుగర్‌ స్థాయిలను సమర్థవంతంగా తగ్గించేందుకు చంద్రప్రభావతి, మంజిస్తాది క్వాత్‌, ప్రవల్‌ భసమ వంటి అనేక మందులు ఉన్నాయి’ అని సబర్వాల్ చెప్పుకొచ్చారు.

ప్రీ-డయాబెటిక్‌ వ్యక్తుల్లో కూడా ఆయుర్వేదం పాత్ర పోషిస్తుందని ఆమె తెలిపారు. ఆహారం, జీవన శైలిలో మార్పులతో, అలాంటి వ్యక్తుల రక్తంలో చక్కెర స్థాయిలను జీవితాంతం ఉంచుకోగలుగారు అని డాక్టర్‌ తెలిపారు. టైప్‌ 2 డయాబెటిస్‌తో బాధపడేవారు ఆయుర్వేదం, మందులు, ఆహారంలో మార్పు ద్వారా వ్యాధి లక్షణాలను అణిచివేస్తుంది. ఆయుర్వేద చికిత్సలో ఉన్న మొత్తం నాలుగు దశలు ఇవే..

డిటాక్సిఫికేషన్‌: పంచకర్మా థెరపీ వంటి ప్రత్యేక డిటాక్సిఫైయింగ్‌ చికిత్స ద్వారా జీవక్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.

రిపేరింగ్‌: కొన్ని రకాల రసాయనాల మూలికలతో శరీరంలోని కణాజాలాకు పునర్జీవ ప్రక్రియ మెరుగవుతోంది.

రిస్టోర్‌: ఈ దశలో శరీరంలోని అవయవాలు సాధారణ స్థితికి వస్తాయి. ఈ విధానంలో కరివేపాకు, తులసి మెరుగైన శరీర పనితీరు కోసం ఉపయోగిస్తున్నారు.

మెయింటెనెన్స్‌: రక్తంలో చక్కెర స్థాయిలను జీవితాంతం కంట్రోల్‌లో పెట్టుకోవాలంటే హెర్బల్‌ ఫార్ములాతో పాటు తీసుకునే ఆహారంలో మార్పులు చేయాల్సి ఉంటుంది.

ఏం తినకూడదు..

డయాబెటిస్‌తో బాధపడేవారు రాత్రి 8 గంల తర్వాత భోజనం చేయకూడదు. రాత్రి పూట అన్నం, పెరుగుకు దూరంగా ఉండాలి. మూడు పూటల భోజనం చేసే బదులు, ప్రతి రెండె గంటలకు కొంచెం కొంచెం తినడం అలవాలు చేసుకోవాలి. ఆహారం తిన్న వెంటనే నడవం ద్వారా షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది. ఒత్తిడి మధుమేహ వ్యాధిగ్రస్తులకు శాపం లాంటిది. ఇది చక్కెర స్థాయిలను పెంచుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఒత్తిడిని దరి చేరనివ్వకూడదు.

ఏం తినాలి..

షుగర్‌తో బాధపడే వారు బంగాళ దుంపలు, జంక్ ఫుడ్‌, వేయించిన ఆహారాలు, మామిడి, అరటి పండు వంటివి తినడానికి బదులుగా బొప్పాయి, యాపిల్‌, కివీ వంటివి తినాలి. షుగర్‌ పేషెంట్స్‌ తియ్యగా ఉండే పండ్లను దూరంగా ఉండాలి. అధికంగా ప్రోటీన్లు, ఫైబర్‌ ఉన్న ఉహారాన్ని తీసుకోవాలని డాక్టర్‌ సబర్వాల్‌ తెలిపారు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..