Monkey pox: మానవాళిని భయపెడుతోన్న మంకీ పాక్స్.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..
Monkey pox: కరోనా మహమ్మారి (Coraona) సృష్టించిన అల్లకల్లోలం ఇంకా పూర్తిగా సద్దుమణుగక ముందే మరో వైరస్ ప్రపంచంపై దండెత్తుతోంది. మంకీపాక్స్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది...
Monkey pox: కరోనా మహమ్మారి (Coraona) సృష్టించిన అల్లకల్లోలం ఇంకా పూర్తిగా సద్దుమణుగక ముందే మరో వైరస్ ప్రపంచంపై దండెత్తుతోంది. మంకీపాక్స్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆఫ్రికా దేశాల్లో అడపాదడపా వెలుగుల్లోకి వచ్చే ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాలకు విస్తరించింది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3400 కేసులు నమోదయ్యాయి. గడిచిన కేవలం 11 రోజుల్లోనే 1310 మంకీపాక్స్ కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కొత్తగా మరో 8 దేశాలకు వ్యాపించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
దీంతో మంకీపాక్స్ ఇప్పటి వరకు మొత్తం 50 దేశాలకు విస్తరించింది. మంకీ పాక్స్ వ్యాప్తి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ మాట్లాడుతూ.. ‘ఆస్ట్రేలియాలో 13 కేసులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 4100 కేసులు వెలుగు చూశాయి. బయటపడని కేసుల సంఖ్య భారీగానే ఉండవచ్చు. ఈ వ్యాధి వల్ల పొంచివున్న ముప్పుపై తీవ్ర ఆందోళన చెందుతున్నాం’ అని తెలిపారు.
ఇదిలా ఉంటే డబ్ల్యూహెచ్‌ఓ గత వారం మంకీపాక్స్‌ను ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించకూడదని నిర్ణయించింది. అయినప్పటికీ మాత్రం మంకీపాక్స్ వ్యాప్తి గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..