Mint Leaves: ఈ ఆకులతో మీకు కడుపంతా క్లీన్.. బ్రెష్‌తో కడిగినట్లే
వంటల్లో మంచి రుచి, సువాసన కోసం పుదీనా వాడుతుంటారు. అయితే పుదీనా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయ్. ఎసిడిటీ, జీర్ణ సంబంధిత సమస్యలకు పుదీనాతో చెక్ పెట్టవచ్చు. 100 గ్రాముల పుదీనాలో 5 గ్రాముల జింక్, 10 గ్రాముల సెలీనియం, 586 మిల్లి గ్రాముల పొటాషియం, 56 మిల్లి గ్రాముల సోడియం సహా విటమిన్ సీ, విటమిన్ ఏ, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బీ6, ఫోలేట్, కాల్షియం కూడా సమృద్ధిగా లభిస్తాయి.

పుదీనా లేకుండా రోజు గడుస్తుందా చెప్పండి. టీ దగ్గర్నుంచి.. చెట్నీలు, కర్రీలు ఇలా అన్నింటిలో పుదీనా వేస్తారు. అయితే ఇది కేవలం టేస్ట్ కోసమే అనుకోకండి. పుదీనా వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. యాంటి ఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్స్ పుదీనాలో పుష్కలం. పాలీ ఫినాల్స్‌కు పుదీనా గొప్ప వనరు. కార్మినేటివ్, యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు దీనిలో ఉంటాయి. అంతేకాదు.. కొవ్వులు, క్యాలరీలు చాలా తక్కువ. పుదీనాను రెగ్యులర్ డైట్‌లో తీసుకుంటే.. ఐరన్, పొటాషియం, మాంగనీస్ శరీరానికి అందుతాయి. పుదీనా వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం…
- పుదీనాలో ఉండే.. ఎంజైములు ఆహారాన్ని సులువుగా జీర్ణం చేస్తాయి. అంతేకాదు.. ఎసిడిటీ, ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలను దూరం చేస్తుంది. అలానే కడపులో అల్సర్లు రాకుండా నిలవరిస్తుంది.
- పొల్యూషన్‌లో తిరిగేవారికి, స్మోక్ చేసేవారికి ఊపిరితిత్తుల వ్యాధుల వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిరోజూ పుదీనాను తీసుకుంటే లంగ్స్ క్లీన్ అవుతాయి.
- చర్మ సంబంధిత సమస్యలతో బాధ పడేవారికి కూడా పుదీనా బాగా ఉపయోగపడుతుంది. పుదీనా జ్యూస్ తాగడం వల్ల ముఖంపై మచ్చలు, మెటిమలకు చెక్ పెట్టవచ్చు.
- మెదడుకు మేలు చేసే.. విటమిన్ బీ 6, మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్ వంటివి పుదీనాలో ఉంటాయి.
- శరీరంలోని కొలెస్ట్రాల్‌ను సైతం పుదీనా తగ్గిస్తుంది
- పుదీనాలో ఉండే మెంథాల్ శరీరంలోని కండరాలను రిలాక్స్ చేసి.. పెయిన్ తగ్గిస్తుందిః
- తలనొప్పిని తగ్గించడంలో కూడా పుదీనా పాత్ర ప్రముఖమైనది
- పుదీనా ఒత్తిడిని తగ్గిస్తుందని పలు పరిశోధనల్లో నిరూపితమైంది
- అప్పుడప్పుడు పుదీనా ఆకులను నమలిదే.. దంతాల ఆరోగ్యం బాగుంటుంది. అలానే నోరంతా క్లీన్ అవుతుంది
- ఒకవేళ వికారంతో బాధపడుతుంటే పుదీనా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ ఆహారంలో పుదీనా ఉండేటట్లు చూసుకోవడం మంచిదని డైటీషియన్లు చెబుతున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే డాక్లర్లను సంప్రదించాలని సూచిస్తున్నాము.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




