AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SreeLeela: అందం కోసం యంగ్ హీరోయిన్ ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసా.. షాకవ్వక తప్పదు

దక్షిణ భారత సినిమాలో ఒక్కసారిగా టాప్ లీగ్‌కి ఎగిరిన యంగ్ హీరోయిన్… డాన్స్ అయితే డైనమైట్, ఎనర్జీ అయితే ఎప్పుడూ ఓవర్‌ఫ్లో! పుష్ప, ధమాకా, గుంటూరు కారం, భగవంత్ కేసరి వంటి బ్లాక్‌బస్టర్స్‌తో ఇప్పుడు పాన్-ఇండియా లెవెల్‌లో డిమాండ్ గల హీరోయిన్గా మారిపోయింది..

SreeLeela: అందం కోసం యంగ్ హీరోయిన్ ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసా.. షాకవ్వక తప్పదు
Shree Leela
Nikhil
|

Updated on: Nov 18, 2025 | 11:34 PM

Share

దక్షిణ భారత సినిమాలో ఒక్కసారిగా టాప్ లీగ్‌కి ఎగిరిన యంగ్ హీరోయిన్… డాన్స్ అయితే డైనమైట్, ఎనర్జీ అయితే ఎప్పుడూ ఓవర్‌ఫ్లో! పుష్ప, ధమాకా, గుంటూరు కారం, భగవంత్ కేసరి వంటి బ్లాక్‌బస్టర్స్‌తో ఇప్పుడు పాన్-ఇండియా లెవెల్‌లో డిమాండ్ గల హీరోయిన్గా మారిపోయింది.

ఆమె ఫిట్నెస్, గ్లోయింగ్ స్కిన్ చూస్తే ‘ఎలా సాధ్యం?’ అనే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఆమె ఫిట్‌నెస్ రొటీన్ సూపర్ సీరియస్! ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు… శ్రీలీల! కేవలం 23 ఏళ్ల వయసులోనే శ్రీలీల శరీరం ఇంత టోన్డ్‌గా ఉండటానికి కారణం క్రమశిక్షణాత్మక లైఫ్‌స్టైల్. శ్రీలల తల్లి ఒక గైనకాలజిస్ట్. తల్లి ఇన్‌స్పిరేషన్‌తో శ్రీలీల కూడా MBBS పూర్తి చేసింది. ఫిట్‌నెస్‌ని కూడా సైన్స్‌లా ఫాలో అవుతుంది.

యోగా

‘యోగా లేకపోతే నా రోజు స్టార్ట్ కాదు’ అంటూ శ్రీలీలనే స్వయంగా చెప్పింది. ప్రతిరోజూ ఉదయం 5:30 నుంచి 45 నిమిషాలు సూర్య నమస్కారాలు (12 రౌండ్స్), అనులోమ-విలోమ, భస్త్రిక, కపాలభాతి, శీర్షాసనం, ధనురాసనం, వృక్షాసనం వంటివి చేస్తుంది. ఇవి ఒత్తిడి తగ్గించడమే కాకుండా, డ్యాన్స్ మూవ్స్‌కి అవసరమైన ఫ్లెక్సిబిలిటీ ఇస్తాయి.

జిమ్‌లో ఫైర్ వర్కౌట్

వారంలో 5-6 రోజులు జిమ్ తప్పనిసరి. ఆమె రొటీన్‌లో ఉండే కీ ఎక్సర్‌సైజ్‌లు, బార్బెల్ స్క్వాట్స్, రొమానియన్ డెడ్‌లిఫ్ట్స్, హిప్ థ్రస్ట్స్, బల్గేరియన్ స్ప్లిట్ స్క్వాట్స్, పుల్-అప్స్, షోల్డర్ ప్రెస్, బెంచ్ ప్రెస్, ప్లాంక్స్, రష్యన్ ట్విస్ట్స్, హ్యాంగింగ్ లెగ్ రైజెస్, హెవీ వెయిట్స్‌తో 4 సెట్స్ × 10-12 రెప్స్. కార్డియో కోసం HIIT లేదా 30 నిమిషాల డాన్స్ వర్కౌట్ కూడా జత చేస్తుంది.

క్లీన్ & బ్యాలెన్స్డ్ డైట్

శ్రీలీల తను తీసుకునే ఆహారంపై కూడా శ్రద్ధ వహిస్తుంది. 60% క్లీన్ ఫుడ్, 40% బ్యాలెన్స్. రోజుకు 5-6 మీల్స్ తప్పనిసరి. ఉదయం: కొబ్బరి నీరు + 4 బాదం + 2 వాల్‌నట్స్, బ్రేక్‌ఫాస్ట్: ఓట్స్ ఉప్మా లేదా వెజ్ ఆమ్లెట్ + ఫ్రూట్స్ , మిడ్ మార్నింగ్: గ్రీన్ టీ + గ్రీక్ యోగర్ట్, లంచ్: బ్రౌన్ రైస్/రాగి రొట్టె + గ్రిల్డ్ చికెన్ లేదా పనీర్ + ఆకుకూరలు, స్నాక్స్: ప్రోటీన్ షేక్ + బెర్రీస్, డిన్నర్: సలాడ్ బౌల్ లేదా గ్రిల్డ్ ఫిష్ + సూప్  తీసుకుంటుంది.

జంక్ ఫుడ్, షుగర్ డ్రింక్స్‌ అస్సలు ముట్టుకోదు. రోజుకు 4 లీటర్ల నీరు తప్పనిసరి. వీటితోపాటు పది గంటల్లోపు పడుకోవడం తప్పనిసరిగా 7-8 గంటల నిద్ర, ధ్యానం కూడా తన దినచర్యలో తప్పకుండా ఉండేలా చూసుకుంటుంది శ్రీలీల. ‘ఫిట్‌నెస్ అంటే శరీరం మాత్రమే కాదు… మనసు, ఆత్మ కూడా’ అనే విషయాన్ని చెప్పడమే కాదు తూ.చ తప్పకుండా పాటిస్తుంది ఈ యంగ్ బ్యూటీ. శ్రీలీల మాదిరిగా మెరిసిపోవాలంటే మీరూ వెంటనే ప్రారంభించండి!