Brains & Beauty: యాక్టింగ్ సరే.. ఈ స్టార్ హీరోయిన్ల ఎడ్యుకేషన్ జర్నీ గురించి తెలుసా..?
టాలీవుడ్ హీరోయిన్లు అందం, అభినయంతో మాత్రమే కాదు, వాళ్ల ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్‌తో కూడా ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తున్నారు. హై ప్రెస్టీజ్ కాలేజీల నుంచి డిగ్రీలు సాధించి, సినిమా కెరీర్‌తో బ్యాలెన్స్ చేసిన ఈ స్టార్స్, 'బ్రెయిన్స్ & బ్యూటీ' మంత్రాన్ని ప్రూవ్ చేస్తున్నారు. వాళ్ల అకడమిక్ జర్నీలు..

టాలీవుడ్ హీరోయిన్లు అందం, అభినయంతో మాత్రమే కాదు, వాళ్ల ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్‌తో కూడా ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తున్నారు. హై ప్రెస్టీజ్ కాలేజీల నుంచి డిగ్రీలు సాధించి, సినిమా కెరీర్‌తో బ్యాలెన్స్ చేసిన ఈ స్టార్స్, ‘బ్రెయిన్స్ & బ్యూటీ’ మంత్రాన్ని ప్రూవ్ చేస్తున్నారు. వాళ్ల అకడమిక్ జర్నీలు ఆశ్చర్యకరంగానూ, ఆదర్శంగానూ ఉన్నాయి. టాప్ 10 టాలివుడ్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసుకుందాం..

Sai Pallavii
సాయి పల్లవి
నేచురల్ యాక్టింగ్, నో-మేకప్ లుక్‌తో ఫేమస్ అయిన సాయి పల్లవి చదువులోనూ గొప్పే. పక్కింటి అమ్మాయిలా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ భామ కోయంబత్తూర్‌లోని అవిలా కాన్వెంట్ స్కూల్‌లో స్కూలింగ్ చేసి, 2016లో జార్జియాలోని టబ్లిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుంచి MBBS పూర్తి చేసింది. 2020లో FMGE ఎగ్జామ్ కూడా క్లియర్ చేసింది. త్వరలోనే రామాయణంలో సీతగా కనిపించబోతోంది.

Samantha
సమంత రుత్ ప్రభు
మైటీ మహరాణి, ఏమాయ చేసావే సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగిన సమంత, చెన్నైలోని హోలీ ఏంజెల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో స్కూలింగ్ చేసింది. స్టెల్లా మారిస్ కాలేజ్, చెన్నై నుంచి కామర్స్‌లో డిగ్రీ (డిస్టింక్షన్‌తో) పూర్తి చేసింది. ఫైనాన్షియల్ కాన్‌స్ట్రెయింట్స్ కారణంగా హయ్యర్ ఎడ్యుకేషన్ మిస్ అయిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సమంత పదో తరగతి మార్క్ షీట్ వైరల్ అయ్యింది. అందులో మ్యాథ్స్‌లో 100/100 చూసి సమంత అభిమానులు గర్వపడుతున్నారు!

Sreee Leela
శ్రీలీల
డైనమిక్ డ్యాన్సర్గా టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ శ్రీలీల. అమ్మ ఇన్‌స్పిరేషన్‌తో శ్రీలీల MBBS చేసింది. 2021లో భగత్ పూల్ సింగ్ మెడికల్ కాలేజ్, హర్యానాలో డిగ్రీ పూర్తి చేసి, సినిమాలతో బ్యాలెన్స్ చేసుకుంది. బెంగళూరులో పెరిగిన శ్రీలీల బాలీవుడ్‌లో ఇబ్రహీం అలీ ఖాన్‌తో డిలర్ డెబ్యూ చేస్తోంది.

Trishaa
త్రిషా కృష్ణన్
సౌత్ క్వీన్ త్రిష చెన్నైలోని సేక్రెడ్ హార్ట్ మ్యాట్రిక్యులేషన్ స్కూల్‌లో స్కూలింగ్ చేసి, ఎథిరాజ్ కాలేజ్ ఫర్ వుమెన్, చెన్నై నుంచి BBA డిగ్రీ పూర్తి చేసింది. మిస్ చెన్నై 1999 విన్నర్‌గా సినిమా ఎంట్రీ ఇచ్చిన ఆమె సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్గా వరుస అవకాశాలు అందుకుంటోంది. సౌత్‌లో టాప్ పెయిడ్ యాక్ట్రెస్‌లలో ఒకరు త్రిష!

Anushka
అనుష్క శెట్టి
బాహుబలిలో దేవసేనగా గ్లోబల్ ఫేమ్ పొందిన అనుష్క, మౌంట్ కార్మెల్ కాలేజ్, బెంగళూరు నుంచి BCA డిగ్రీ చేసింది. భరత్ ఠాకూర్ యోగా స్కూల్‌లో డిప్లొమా కూడా పూర్తి చేసింది. తులు స్పీకింగ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె, అరుంధతి, రుద్రమదేవి, భాగమతి సినిమాలతో ఫీమేల్ సెంట్రిక్ రోల్స్‌తో కూడా తానేంటో నిరూపించుకుంది.

Rashmika Mandaanna
రష్మికా మందన్నా
నేషనల్ క్రష్ రష్మిక, కోడగులోని కూర్గ్ పబ్లిక్ స్కూల్‌లో స్కూలింగ్, మైసూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్‌లో ఇంటర్మీడియట్ చేసి, MS రామయ్య కాలేజ్, బెంగళూరు నుంచి సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్‌లో డబుల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. పుష్ప, అనిమల్ సినిమాలతోతో పాన్-ఇండియా స్టార్గా ఎదిగింది.

Tammannaah
తమన్నా భాటియా
హ్యాపీ డేస్, బాహుబలి సినిమాలతో పాపులర్ అయిన తమన్నా, ముంబైలోని మానెక్జీ కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్కూల్‌లో స్కూలింగ్ చేసి, నేషనల్ కాలేజ్, ముంబై నుంచి BA (డిస్టెన్స్ ఎడ్యుకేషన్) పూర్తి చేసింది. 13 ఏళ్ల వయసులో స్కూల్ ఫంక్షన్‌లో స్పాట్ అయి సినిమా ఎంట్రీ ఇచ్చింది.

Nithya Menon
నిత్యా మీనన్
మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో రాణిస్తున్న నిత్యా మల్టీ-టాలెంటెడ్ విమన్. బెంగళూరు పూర్ణ ప్రజ్ఞా స్కూల్, మౌంట్ కార్మెల్ కాలేజ్‌లో స్కూలింగ్ చేసి, మనిపాల్ యూనివర్సిటీ నుంచి జర్నలిజం & కమ్యూనికేషన్ డిగ్రీ పూర్తి చేసింది. పూణె ఫిల్మ్ & టీవీ ఇన్‌స్టిట్యూట్‌లో సినిమాటోగ్రఫీ కోర్స్ కూడా చేసింది.

Shruthi Hassan
శ్రుతి హాసన్
కమల్ హాసన్ కూతురు శ్రుతి, చెన్నైలోని లేడీ ఆండల్ వెంకట సుబ్బారావ్ స్కూల్‌లో స్కూలింగ్ చేసి, ముంబై సెయింట్ ఆండ్రూస్ కాలేజ్ నుంచి సైకాలజీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. కాలిఫోర్నియాలో మ్యూజిషియన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో మ్యూజిక్ లెర్న్ చేసింది. నటిగా రాణిస్తూనే పాప్ సింగర్గానూ ఊపేస్తోంది.

Pooja Hegde
పూజా హెగ్డే
గ్లామరస్ బ్యూటీ పూజా, ముంబై మానెక్జీ కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్కూల్‌లో స్కూలింగ్ చేసి, MMK కాలేజ్, ముంబై నుంచి B.Com డిగ్రీ పూర్తి చేసింది. మిస్ యూనివర్స్ ఇండియా 2010 రన్నరప్గా నిలిచింది.
