Happy Mother’s Day 2021: ఫ్యామిలితో కలిసిన అందమైన వీడియోను షేర్ చేస్తూ మథర్స్ డే శుభాకాంక్షలను తెలిపిన రోజా..

RK Roja: అమ్మ.. పసితనంలో తప్పటడుగులు వేసే వేళ జారిపడితే విలవిల్లాడుతుంది. పెరిగ పెద్దయ్యాక ఇంటికి రావటం ఆలస్యమైతే తల్లడిల్లుతుంది.

Happy Mother's Day 2021: ఫ్యామిలితో కలిసిన అందమైన వీడియోను షేర్ చేస్తూ మథర్స్ డే శుభాకాంక్షలను తెలిపిన రోజా..
Roja Family
Follow us
Rajitha Chanti

|

Updated on: May 09, 2021 | 10:56 PM

RK Roja: అమ్మ.. పసితనంలో తప్పటడుగులు వేసే వేళ జారిపడితే విలవిల్లాడుతుంది. పెరిగ పెద్దయ్యాక ఇంటికి రావటం ఆలస్యమైతే తల్లడిల్లుతుంది. కన్నబిడ్డలకు ఏ కాస్త కష్టమొచ్చినా భరించలేని మమకారం మాతృమూర్తి సొంతం. మే 9 అంతర్జాతీయ మాతృ దినోత్సవం.. ఈ సందర్భంగా సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు తమ తల్లులను గుర్తుచేసుకుంటూ అంతర్జాతీయ మాతృ దినోత్సవం శుభాకాంక్షలను సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యే.. నటి రోజా కూడా మధర్స్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా తన ఫ్యామిలీతో కలిసి ఉన్న ఓ అందమైన వీడియోను షేర్ చేసుకున్నారు.

వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి శస్త్రచికిత్స కారణంగా పూర్తి విరామానికి పరిమితమైన ఆమె.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి జబర్ధస్త్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంట్లో సందడిని రెట్టింపు చేస్తున్నారు. మదర్స్ డే సందర్భంగా అమ్మతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు ఆర్కే రోజా.. అలాగే అమ్మ గొప్పతనాన్ని తెలియజేస్తూ ఓ వీడియో కూడా విడుదల చేశారు. తనకు అమ్మపై ఉన్న ప్రేమ ఏంటో మరోసారి అందరికీ తెలిసేలా చేశారు రోజా. ఇదిలా ఉంటే రోజాకు మంత్రి పదవి ఖాయమైనట్టుగా సమాచారం వినిపిస్తోంది. త్వరలోనే సీఎం జగన్ ఈ కబురును అధికారికంగా ప్రకటించబోతున్నట్లుగా సమాచారం. అలాగే రోజా తిరిగి జబర్ధస్థ్ షోలో కనిపించబోతున్నారట.

ట్వీట్..

Also Read: చరణ్- శంకర్ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ గాసిప్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‏లో కీలక పాత్రలో ఆ స్టార్ హీరో..

ట్రీట్‏మెంట్ అందితే బ్రతుకుతాను.. ఆక్సిజన్ బెడ్ ఉంటే హెల్ప్ చేయండంటూ నటుడి పోస్ట్.. కానీ అంతలోనే..

విజయ్ ఫ్యాన్స్‏కు బ్యాడ్ న్యూస్.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయమే మంచిదంటూ పూరీ టీం ట్వీట్..