AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Song : ఏం పాట రా బాబూ.. ఒక్కో లిరిక్ వింటే గూస్ బంప్స్.. 27 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్..

సాధారణంగా సినీరంగంలో ఎవర్ గ్రీన్ హిట్ సినిమాలతోపాటు కొన్ని పాటలు సైతం దశాబ్దాలు గడిచినా ఏమాత్రం క్రేజ్ తప్పవు. ఎన్నేళ్లైనా ఆ పాటకు ఉన్న ఫాలోయింగ్ మాత్రం తగ్గదు. ఒక్కో లిరిక్స్ శ్రోతలను ఊర్రూతలూగిస్తాయి. ఇప్పటికీ అలాంటి పాటలు నెట్టింట దుమ్మురేపుతుంటాయి. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సాంగ్ ఒకటి.

Trending Song : ఏం పాట రా బాబూ.. ఒక్కో లిరిక్ వింటే గూస్ బంప్స్.. 27 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్..
Meriseti Puvva Song
Rajitha Chanti
|

Updated on: Nov 04, 2026 | 9:39 AM

Share

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొన్ని పాటలు కేవలం వినసొంపుగా ఉండటమే కాకుండా, దశాబ్దాలు గడిచినా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేస్తుంటాయి. అప్పట్లోని స్టార్ హీరోల క్రేజ్, అద్భుతమైన సాహిత్యం, మంత్రముగ్ధులను చేసే సంగీతం కలగలిస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి నాటి క్లాసిక్ సినిమాలే నిదర్శనం. సరిగ్గా అలాంటి కోవకే చెందే సూపర్‌స్టార్ రజనీకాంత్, రమ్యకృష్ణ నటించిన నరసింహ (Padayappa) చిత్రంలోని ‘మెరిసేటి పువ్వా సిరిమువ్వా..’ సాంగ్ ఇటు యూత్‌ను, అటు మ్యూజిక్ లవర్స్‌ను ఇప్పటికీ ఏ రేంజ్‌లో ఉర్రూతలూగిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పట్లో ఈ పాట థియేటర్లలో మారుమోగింది. అంతేకాదు.. ఈ పాటకు యూత్ లో పిచ్చి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. అటు యూట్యూబ్, ఇటు ఇన్ స్టాలో ఈ పాట మారుమోగుతూనే ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‏తో యూట్యూబ్ షేక్..

ఈ అద్భుతమైన పాటలో వచ్చే ప్రతీ లిరిక్ వింటే సంగీత ప్రియులకు గూస్ బంప్స్ రావడం ఖాయం. ఒకవైపు అమ్మాయిల హావభావాలు, వారిలోని ప్రత్యేకమైన పొగరు.. మరోవైపు అబ్బాయిలలో ఉండే గౌరవం, వారి ఆప్యాయతలను ఈ పాటలో అద్భుతంగా ఆవిష్కరించారు. తెరపై రజనీకాంత్ స్టైల్ అండ్ స్వాగ్‌కు తగినట్లుగా రమ్యకృష్ణ (నీలాంబరి పాత్ర) పలికించిన పవర్ ఫుల్ హావభావాలు ఈ పాటకు ప్రాణం పోశాయి. ఈ పాటంటే అప్పట్లో యూత్‌లో ఏ స్థాయి క్రేజ్ ఉండేదో, నేటి డిజిటల్ యుగంలోనూ యూట్యూబ్‌లో దీనికి వస్తున్న వ్యూసే నిదర్శనం.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

దాదాపు 27 ఏళ్లు గడుస్తున్నప్పటికీ, ఈ సాంగ్ మానియా ఏమాత్రం తగ్గలేదు. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటికీ మిలియన్ల మంది వీక్షిస్తూనే ఉన్నారు. కేవలం సినిమా రన్‌టైమ్‌లో వచ్చే పాటగానే కాకుండా, సోషల్ మీడియా రీల్స్ , షార్ట్స్ ట్రెండ్స్‌లోనూ ఈ మెలోడీ తన హవాను కొనసాగిస్తోంది. కాలం ఎంత మారినా, కొత్త తరాలు ఎన్ని వస్తున్నా క్లాసిక్ మ్యూజిక్ అందించే కిక్ వేరు అని ఈ సాంగ్ మరోసారి నిరూపిస్తూనే ఉంది. వెండితెరపై దశాబ్దాల చరిత్రను సృష్టించిన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల ప్లేలిస్ట్‌లో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్‌గా నిలిచిపోతుంది.

ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..

మెరిసేటి పువ్వా సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..

Follow Us