AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : బాక్సాఫీస్ రేసులో భారీ సినిమాల హడావిడి.. నవంబర్ నెలలో సినీ ప్రియులకు పూనకాలే..

సాధారణంగా పండుగల సీజన్లలోనే బాక్సాఫీస్ వద్ద హడావిడి కనిపిస్తుంది. కానీ ఈ ఏడాది నవంబర్ మాసం సంక్రాంతిని మించిన సినిమాల జాతరను తలపిస్తోంది. పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణం: పార్ట్ 1' నుంచి కల్ట్ సీక్వెల్ 'ఈ నగరానికి ఏమైంది రిపీట్', రష్మిక 'మైసా', బెల్లంకొండ 'హైందవ' వరకు వరుస పాన్ ఇండియా, క్రేజీ ప్రాజెక్ట్‌లతో థియేటర్లలో రికార్డుల మోత మోగడానికి సిద్ధమైంది. ఈ నెలలో ఏఏ సినిమాలు రిలీజ్ కానున్నాయో తెలుసుకుందామా.

Tollywood : బాక్సాఫీస్ రేసులో భారీ సినిమాల హడావిడి.. నవంబర్ నెలలో సినీ ప్రియులకు పూనకాలే..
November Movies 2026
Rajitha Chanti
|

Updated on: Nov 04, 2026 | 9:15 AM

Share

సాధారణంగా టాలీవుడ్‌లో సంక్రాంతి లేదా పండగ సీజన్లలోనే భారీ సినిమాలు విడుదలవుతుంటాయి. కానీ ఈ ఏడాది నవంబర్ నెల మాత్రం దానికి మించిన సినీ పండగను తలపిస్తోంది. వారం వారం విభిన్న కథాంశాలు, అగ్ర నటీనటుల క్రేజీ ప్రాజెక్ట్‌లతో బాక్సాఫీస్ కళకళలాడటానికి సిద్ధమైంది. చిన్న, మధ్య తరహా చిత్రాలతో పాటు పాన్ ఇండియా స్థాయి సినిమాలు సైతం బరిలో దిగుతుండటంతో థియేటర్ల వద్ద సందడి తారాస్థాయికి చేరనుంది. నవంబర్ నెల ఆరంభంలోనే బాక్సాఫీస్ వద్ద భారీ హంగామా మొదలుకానుంది. దీపావళి కానుకగా వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణం: పార్ట్ 1’ (Ramayana: Part 1) నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నితీశ్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా నటిస్తున్న ఈ విజువల్ వండర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

రెండవ వారంలో దాదాపు పది సినిమాలు సైతం విడుదల కానున్నాయి. నవంబర్ 12, 13 తేదీలలో శర్వానంద్, సంపత్ నంది కాంబోలో తెరకెక్కిన భోగి సినిమా రిలీజ్ కానుంది. అలాగే సుడిగాలి సుధీర్ నటించిన గోట్ మూవీ సైతం రానుంది. వీటితో పాటు అక్కినేని నాగార్జున సమర్పణలో తెరకెక్కిన ‘ఇట్లు అర్జున’, ‘చంద్రయాన్’, ‘మాయలేడి’ వంటి చిత్రాలు కూడా నవంబర్ ప్రారంభంలోనే సందడి చేయనున్నాయి.

అలాగే మూడో వారంలో మరింత ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. యూత్‌లో కల్ట్ ఫాలోయింగ్ ఉన్న ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా తరుణ్ భాస్కర్ – విశ్వక్‌సేన్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ నవంబర్ 19న విడుదలవుతుండటంతో యువతలో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అలాగే దుల్కర్ సల్మాన్ నటించిన ఆకాశంలో ఒక తార, ధనుష్, సాయి పల్లవి నటిస్తున్న ఓం, కీర్తు సురేష్ సత్యవాన్ సావిత్రి సైతం రిలీజ్ కానున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‏తో యూట్యూబ్ షేక్..

నెలఖారులోనూ లేడీ ఓరియెంటెడ్ , మాస్ యాక్షన్ సినిమాల జోరు కొనసాగనుంది. నవంబర్ 27న గిరిజన యువతిగా రష్మిక మందన్న కనిపిస్తున్న ‘మైసా’ మూవీతో పాటు, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘హైందవ’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. ఇలా రకరకాల జానర్‌లతో వస్తున్న ఈ సినిమాలతో నవంబర్ మాసం టాలీవుడ్‌కు ఒక రేంజ్ బాక్సాఫీస్ బోనంజాగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..

Follow Us