గోల్డెన్ వీసాతో UAEలో పర్యటించిన రజనీకాంత్.. అబుదాబిలో హిందూ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరో

అబుదాబి ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక UAE గోల్డెన్ వీసా అందుకున్న తరువాత హీరో రజనీకాంత్ ఆ దేశ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. అబుదాబి ప్రభుత్వం నుంచి ఈ ప్రతిష్టాత్మక గోల్డెన్ వీసాను స్వీకరించడం తనకు చాలా గౌరవంగా ఉందని చెప్పారు. ఆ దేశంలోని BAPS హిందూ మందిర్‌ను సందర్శించిన అనంతరం ఆలయ అధికారిక సోషల్ మీడియా ఖాతా, Xలో ఆకర్షణీయమైన చిత్రాలను, రజనీకాంత్ ఆలయాన్ని సందర్శనకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.

గోల్డెన్ వీసాతో UAEలో పర్యటించిన రజనీకాంత్.. అబుదాబిలో హిందూ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరో
Rajinikanth Abu Dhabi Temple
Follow us
Surya Kala

|

Updated on: May 24, 2024 | 7:03 PM

కోలీవుడ్ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి గోల్డెన్ వీసాను అందుకున్నారు. ఇటీవల అబుదాబిలోని హిందూ ఆలయాన్ని రజనీకాంత్ సందర్శించారు. ఆ దేశంలోని BAPS హిందూ మందిర్‌ను సందర్శించిన అనంతరం ఆలయ అధికారిక సోషల్ మీడియా ఖాతా, Xలో ఆకర్షణీయమైన చిత్రాలను, రజనీకాంత్ ఆలయాన్ని సందర్శనకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో రజనీకాంత్ కు ఆలయ పూజారి.. ఆలయ ప్రాముఖ్యత గురించి వివరించారు. పూజారి రజనీకాంత్ మణికట్టుకు పవిత్రమైన దారాన్ని రక్షగా కట్టారు. ఆలయం నుంచి బయటకు వచ్చే ముందు బాప్స్ ఆలయాన్ని సందర్శించినందుకు గుర్తుగా ఒక పుస్తకాన్ని అందజేశారు.

ఇలా హిందూ ఆలయాన్ని సందర్శిస్తున్న సమయంలో రజనీకాంత్ పరిసరాలను ఫోటోలను తీయడం, పలువురు వ్యక్తులతో ఫోటోగ్రాఫ్‌లకు పోజులను ఇచ్చారు. ఆలయ నిర్మాణ వైభవాన్ని రజనీకాంత్ ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి

అబుదాబి ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక UAE గోల్డెన్ వీసా అందుకున్న తరువాత హీరో రజనీకాంత్ ఆ దేశ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. అబుదాబి ప్రభుత్వం నుంచి ఈ ప్రతిష్టాత్మక గోల్డెన్ వీసాను స్వీకరించడం తనకు చాలా గౌరవంగా ఉందని చెప్పారు. ఈ వీసాను అందించి తన ప్రయాణాన్ని సులభతరం చేసినందుకు అబుదాబి ప్రభుత్వానికి, తన మంచి స్నేహితుడు, లులు గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలీకి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు రజనీకాంత్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో దీర్ఘకాల రెసిడెన్సీ ప్రోగ్రామ్ అయిన గోల్డెన్ వీసా, వినోద పరిశ్రమలో రజనీకాంత్ చేసిన కృషిని, విజయాలను గుర్తించి మంజూరు చేయబడింది.

ఇటీవల UAE పర్యటనలో రజనీకాంత్ తన ఆప్త మిత్రుడు యూసఫ్, లులు గ్రూప్‌కు చెందిన ప్రముఖ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ల బృందంతో గడిపారు. ఆ తర్వాత రజనీకాంత్ యూసఫ్ నివాసానికి చేరుకున్నారు. యూసఫ్ కు చెందిన విలాసవంతమైన రోల్స్ రాయిస్‌లో ప్రయాణించి ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నేట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలో ఇద్దరు స్నేహితులు ఎంతో ఇష్టంగా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.

రజనీ ప్రొఫెషనల్ ఫ్రంట్

రజనీకాంత్ హీరోగా TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం వెట్టయన్. ఇది అక్టోబరులో విడుదల కానుంది. భారీ అంచనాలతో నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి వంటి స్టార్ నటీనటులు భాగస్వాములు అయ్యారు. మరోవైపు లోకేష్ కనగరాజ్ “కూలీ” షూటింగ్‌లో రజనీకాంత్ తిరిగి పాల్గొననున్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..