ఒకప్పటి హాట్ బ్యూటీ సాక్షి శివానంద్ ఇప్పుడెలా ఉందో.? ఏం చేస్తుందో తెలుసా.!
ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు అందుకుని.. స్టార్ హీరోల సరసన నటించి ఎనలేని స్టార్‌డమ్ సంపాదించింది సాక్షి శివానంద్. 90’sలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువై.. గ్లామరస్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో..

ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు అందుకుని.. స్టార్ హీరోల సరసన నటించి ఎనలేని స్టార్‌డమ్ సంపాదించింది సాక్షి శివానంద్. 90’sలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువై.. గ్లామరస్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించడమే కాకుండా.. చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలతో జతకట్టి ఆడిపాడింది. చిరంజీవి నటించిన ‘మాస్టర్’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది సాక్షి శివానంద్. ఆ తర్వాత నాగార్జున నటించిన సీతారామారాజు మూవీలో మెరిసింది. అటు అరవింద్ స్వామి నటించిన బోధియాల్ అనే తమిళ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అలాగే మహేష్ బాబు జోడిగా నటించిన ‘యువరాజు’ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించింది సాక్షి శివానంద్.
అయితే సరిగ్గా మంచి ఫాంలో ఉండగా.. అనూహ్యంగా సాక్షి శివానంద్ ఇండస్ట్రీకి దూరమైంది. ఆమె కథానాయికగా నటించిన చివరి సినిమా సింహరాశి. ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ సాక్షికి తెలుగులో మరిన్ని అవకాశాలు రాలేదు. ఆ తర్వాత 2008లో జగపతి బాబు నటించిన హోమం సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్ సాంగ్స్‌లో కూడా నటించింది. 2010లో శ్రీకాంత్ నటించిన ‘రంగ: ది దొంగ’ సినిమాలో కనిపించిన సాక్షి.. ఆ తర్వాత మరే మూవీలోనూ కనిపించలేదు. ఇక పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది ఈ అందాల భామ.
Old Actress #SakshiSivanand Rare Photos#tollywood #telugunewstoday #telugustatus pic.twitter.com/5cfIYAkhTH
— telugufunworld (@telugufunworld) May 24, 2024




