AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే సినిమాలో.. ఒకే పాత్రలో.. తండ్రీకొడుకులు..!

తండ్రీకొడుకులు విక్రమ్‌, ధృవ్ ఒకే చిత్రంలో కనిపించనున్నారా..? అంటే అవుననే మాట వినిపిస్తోంది కోలీవుడ్‌లో.

ఒకే సినిమాలో.. ఒకే పాత్రలో.. తండ్రీకొడుకులు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 06, 2020 | 7:37 PM

Share

తండ్రీకొడుకులు విక్రమ్‌, ధృవ్ ఒకే చిత్రంలో కనిపించనున్నారా..? అంటే అవుననే మాట వినిపిస్తోంది కోలీవుడ్‌లో. ప్రస్తుతం అజయ్‌ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో కోబ్రా అనే చిత్రంలో నటిస్తోన్న విక్రమ్.. ఆ తరువాత కార్తీక్ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ పతాకంపై లలిత్ కుమార్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించబోతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే.. ఇందులో విక్రమ్‌ వయస్కుడైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నారట. ఇక ఆ పాత్రకు సంబంధించిన యువకుడి వయసులో ధృవ్ నటించనున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఆదిత్య వర్మ(అర్జున్ రెడ్డి తమిళ రీమేక్‌) ద్వారా విక్రమ్‌ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ధృవ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు వీరిద్దరు కలిసి నటించబోతున్నారన్న వార్తలపై వారి ఫ్యాన్స్ సంతోసం వ్యక్తం చేస్తున్నారు.

Read This Story Also: జీహెచ్‌ఎంసీలో పదోతరగతి పరీక్షలు వాయిదా.. హైకోర్టు సంచలన తీర్పు

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా