రెమ్యునరేషన్‌గా రూ.100 కోట్లు.. షాక్ తిన్న దర్శకుడు..?

సౌత్ సినిమా ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో విజయ్ ఒకరు. తమిళనాడుకు చెందిన ఈ నటుడికి కోలీవుడ్‌లో పాటు మిగిలిన ఇండస్ట్రీల్లోనూ మంచి మార్కెట్ ఉంది. ఇక నార్త్‌లోనూ ఆయన డబ్బింగ్ చిత్రాలు మంచి టీఆర్పీని సంపాదించుకోగా.. అక్కడా అసాధారణ క్రేజ్ ఉంది. అలాగే మలేషియా వంటి ఇతర దేశాల్లోనూ విజయ్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. కోలీవుడ్‌ నుంచి సూపర్‌స్టార్ రజనీకాంత్ తరువాత అంతటి క్రేజ్ విజయ్‌కే సొంతం. అయితే ఈ క్రేజ్‌తో ఆయన చేస్తున్న డిమాండ్‌ మామూలుగా లేదంటున్నారు […]

రెమ్యునరేషన్‌గా రూ.100 కోట్లు.. షాక్ తిన్న దర్శకుడు..?
TV9 Telugu Digital Desk

| Edited By:

Jan 14, 2020 | 2:13 PM

సౌత్ సినిమా ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో విజయ్ ఒకరు. తమిళనాడుకు చెందిన ఈ నటుడికి కోలీవుడ్‌లో పాటు మిగిలిన ఇండస్ట్రీల్లోనూ మంచి మార్కెట్ ఉంది. ఇక నార్త్‌లోనూ ఆయన డబ్బింగ్ చిత్రాలు మంచి టీఆర్పీని సంపాదించుకోగా.. అక్కడా అసాధారణ క్రేజ్ ఉంది. అలాగే మలేషియా వంటి ఇతర దేశాల్లోనూ విజయ్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. కోలీవుడ్‌ నుంచి సూపర్‌స్టార్ రజనీకాంత్ తరువాత అంతటి క్రేజ్ విజయ్‌కే సొంతం. అయితే ఈ క్రేజ్‌తో ఆయన చేస్తున్న డిమాండ్‌ మామూలుగా లేదంటున్నారు కొందరు.

ఇటీవల ఓ బాలీవుడ్ దర్శకుడు పాన్ ఇండియా సినిమా కోసం విజయ్‌ను సంప్రదించారట. ఆ స్క్రిప్ట్‌కు ఓకే చెప్పిన విజయ్.. రెమ్యునరేషన్‌గా మాత్రం వంద కోట్లు కావాలని చెప్పారట. అది కూడా జీఎస్టీ కాకుండా వంద కోట్లు ఉండాలని డిమాండ్ చేశారట. ఇది విన్న ఆ దర్శకుడి నోటి వెంట మాట కూడా రాలేదట. అయితే ఇటీవల విజయ్ మార్కెట్ బాగా పెరిగింది. ఆయన నటించిన బిగిల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని బాషల్లో రూ.150కోట్ల షేర్ రాబట్టింది. ఈ నేపథ్యంలోనే ఆయన అంత డిమాండ్ చేస్తున్నారని విజయ్ టీమ్ చెప్తున్నట్లు తెలుస్తోంది. అయితే బాలీవుడ్‌లో టాప్ హీరోలందరూ భారీ రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు లాభాల్లోనూ షేర్లను కూడా అడుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి దర్శకనిర్మాతల కన్ను సౌతిండియన్ హీరోల మీద పడింది. అయితే ఇక్కడి వారు కూడా అలానే డిమాండ్ చేస్తుండటం వారిని షాక్‌కు గురిచేసిందట. కాగా ప్రస్తుతం విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్టర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్‌గా కనిపిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న మాస్టర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu