డ్రైవింగ్‌లో ఓవర్‌‌యాక్షన్.. నటి సంజనకు పోలీస్ నోటీస్!

డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని పలు మార్లు పోలీసులు చెప్తోన్న.. ఎవరూ పట్టించుకోవడంలేదు. అందులోనూ.. నీతులు చెప్పే సెలెబ్రిటీలే.. ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటే ఇంకేమనాలి. ఈ మధ్య దేశవ్యాప్తంగా ట్రాఫిక్ రూల్స్ కఠినతరమైన సంగతి తెలిసిందే. రూల్స్‌ని బ్రేక్ చేస్తే.. వారు వీరు అనే తేడా లేకుండా.. చలాన్లు వేస్తున్నారు పోలీసులు. ఇప్పుడు నటి సంజన కూడా ఇదే చేసింది. ఒక సెలబ్రిటీ అయి ఉండి.. నటి సంజన డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫీ వీడియో తీసుకుంది. […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:28 am, Tue, 14 January 20
డ్రైవింగ్‌లో ఓవర్‌‌యాక్షన్.. నటి సంజనకు పోలీస్ నోటీస్!

డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని పలు మార్లు పోలీసులు చెప్తోన్న.. ఎవరూ పట్టించుకోవడంలేదు. అందులోనూ.. నీతులు చెప్పే సెలెబ్రిటీలే.. ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటే ఇంకేమనాలి. ఈ మధ్య దేశవ్యాప్తంగా ట్రాఫిక్ రూల్స్ కఠినతరమైన సంగతి తెలిసిందే. రూల్స్‌ని బ్రేక్ చేస్తే.. వారు వీరు అనే తేడా లేకుండా.. చలాన్లు వేస్తున్నారు పోలీసులు. ఇప్పుడు నటి సంజన కూడా ఇదే చేసింది. ఒక సెలబ్రిటీ అయి ఉండి.. నటి సంజన డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫీ వీడియో తీసుకుంది. అది కూడా ఫుల్ ట్రాఫిక్ ఉన్న సమయంలో.

ఆదివారం బెంగుళూరులోని మాజెస్టిక్‌ రోడ్‌లో సాయంత్రం మహేష్ బాబు సినిమాకి వెళ్తూ నటి సంజన.. సెల్ఫీ వీడియో తీసుకుంది. అంతేగాక దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. దీంతో ఇది కాస్తా బెంగుళూరు పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో ఆమెను విచారణకు ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది రెవెన్యూ డిపార్ట్‌మెంట్. అంతేగాక ఆమెపై బెంగుళూరు పోలీసులు గుర్రుగా ఉన్నారు. వివిధ సోష‌ల్ మీడియాల్లో సెలబ్రిటీలను ఫ్యాన్స్ ఫాలో అవుతూంటారు. ఇలాంటి వీడియోలు వాటిల్లో అప్ లోడ్ చేయడం వల్ల.. తమకు ప్రశ్నలు ఉత్పన్నమవుతాయన్నారు. సెలబ్రిలీలు ఎంతో బాధ్యతతో ఉండాలని, మీరే తప్పులు చేస్తే.. తమకు పరిస్థితుల్ని కంట్రోల్ చేయడం కష్టతరమవుతుందని పోలీసులు పేర్కొన్నారు.

 

View this post on Instagram

 

Hey guys I’m going to watch #sarileruneekevvaru ! Can’t Wait to go watch my love love loveeee ❤ #maheshbabu #fangirl

A post shared by SANJJANAA GALRANI (@sanjjanaagalrani) on