భైంసా ఎఫెక్ట్.. ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్..

హైదరాబాద్ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఛలో భైంసాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన్ను పోలీసులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఆదివారం రాత్రి నిర్మల్ జిల్లా భైంసాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు పలు వాహనాలకు, ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో నిరసనకారులను అదుపుచేసే క్రమంలో పలువురు పోలీసు అధికారులు కూడా గాయాలపాలయ్యారు. పరిస్థితులు అదుపులోకి వచ్చాయనుకున్న సమయంలో.. సోమవారం మధ్యాహ్నం మళ్లీ వదంతులు వ్యాపించడంతో.. […]

భైంసా ఎఫెక్ట్.. ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్..
Follow us

| Edited By:

Updated on: Jan 14, 2020 | 11:40 AM

హైదరాబాద్ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఛలో భైంసాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన్ను పోలీసులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఆదివారం రాత్రి నిర్మల్ జిల్లా భైంసాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు పలు వాహనాలకు, ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో నిరసనకారులను అదుపుచేసే క్రమంలో పలువురు పోలీసు అధికారులు కూడా గాయాలపాలయ్యారు. పరిస్థితులు అదుపులోకి వచ్చాయనుకున్న సమయంలో.. సోమవారం మధ్యాహ్నం మళ్లీ వదంతులు వ్యాపించడంతో.. మళ్లీ పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో పట్టణంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి.. మూడు రోజులపాటు కర్ఫ్యూ విధించారు. ఘటనకు సంబంధించి 25మందిని అదుపులోకి తీసున్నట్లు పోలీసులు వెల్లడించారు. కర్ఫ్యూ సమయంలో పోలీసుల ఆదేశాలు ధిక్కరించి.. ఎవరు బయట తిరిగినా అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో రాజాసింగ్ ఛలో భైంసాకు పిలుపునివ్వడంతో.. శాంతి భద్రతలకు విఘాతం కల్గుతుందన్న అభిప్రాయంతో ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో