Vijay Sethupathi: మరో తెలుగు సినిమాలో నటించనున్న మక్కల్ సెల్వన్.. యంగ్ హీరో సినిమాలో కీలక పాత్రలో సేతుపతి..

తమిళ్ నటుడు విజయ్ సేతుపతి క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే తెలుగు తమిళ్ భాషల్లో నటించి ఆకట్టుకున్న విజయ్ సేతుపతి త్వరలో బాలీవుడ్ లోను సత్తా చాటనున్నారు. ఓ వైపు స్టార్ హీరోగా...

Vijay Sethupathi: మరో తెలుగు సినిమాలో నటించనున్న మక్కల్ సెల్వన్.. యంగ్ హీరో సినిమాలో కీలక పాత్రలో సేతుపతి..
Setupathi
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 31, 2021 | 12:25 PM

Vijay Sethupathi: తమిళ్ నటుడు విజయ్ సేతుపతి క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే తెలుగు తమిళ్ భాషల్లో నటించి ఆకట్టుకున్న విజయ్ సేతుపతి త్వరలో బాలీవుడ్‌‌‌‌‌లోనూ సత్తా చాటనున్నారు. ఓ వైపు స్టార్ హీరోగా..మరో వైపు విలన్‌‌‌‌గా మెప్పిస్తూ దూసుకుపోతున్నాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ఈ క్రమంలో సేతుపతి నటించిన పలు సినిమాలు తెలుగులోకి డబ్ అయి మంచి ఆదరణను సొంతం చేసుకొంటున్నాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్న విజయ్ సేతుపతి. ఆ తర్వాత ఉప్పెన సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో కనిపించి మెప్పించారు. హీరోయిన్ తండ్రిగా అయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో మరో తెలుగు సినిమాలో ఆయన నటిస్తున్నట్టు తెలుస్తోంది. యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తోన్నాయి. రాజ్ అండ్ డీకే సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను, రంజిత్ నిర్మిస్తున్నారు. భరత్ చౌదరి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ఈ సినిమాలో కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని  సంప్రదించారట చిత్రయూనిట్. కథ నచ్చడంతో సినిమా చేయడానికి విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో సేతుపతి కనిపించే అవకాశాలు ఉన్నాయని టాక్. ఇటీవల వచ్చిన దళపతి విజయ్ మాస్టర్ సినిమాలో విలన్‌‌‌‌గా నటించి భయపెట్టాడు సేతుపతి. అలాంటి పాత్రనే ఇప్పుడు సందీప్ కిషన్ సినిమాలో పోషించనున్నాడట మక్కల్ సెల్వన్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Nabha Natesh: లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఇస్మార్ట్ బ్యూటీ.. బాలీవుడ్ బడా హీరో సరసన నభానటేష్..

Venu Aravind: టీవీ సీనియర్ యాక్టర్ వేణు అరవింద్ ఆరోగ్య పరిస్థితి విషమం అంటూ వార్తలు.. స్పందించిన రాధిక

Shilpa Shetty: మా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు.. వాటిని నిరోధించండి.. ముంబై హైకోర్టులో శిల్పాశెట్టి పిటిషన్

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు