రిపేర్లు చేయాలన్న విజయ్ దేవరకొండ..!

తన సక్సెస్‌ను కాపాడుకునేందుకు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. విభిన్న కథలను ఎంచుకోవడంతో పాటు సినిమా ఔట్‌పుట్ విషయంలోనూ విజయ్ ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఈ నేపథ్యంలో తన తాజా చిత్రంకు రిపేర్లు చేయమని అతడు దర్శకనిర్మాతలకు కోరినట్లు టాక్. కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ ‘డియర్ కామ్రేడ్‌’లో నటించాడు. సామాజిక కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవల పూర్తి అవ్వగా.. ఫైనల్ కాపీని చూసిన […]

రిపేర్లు చేయాలన్న విజయ్ దేవరకొండ..!

తన సక్సెస్‌ను కాపాడుకునేందుకు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. విభిన్న కథలను ఎంచుకోవడంతో పాటు సినిమా ఔట్‌పుట్ విషయంలోనూ విజయ్ ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఈ నేపథ్యంలో తన తాజా చిత్రంకు రిపేర్లు చేయమని అతడు దర్శకనిర్మాతలకు కోరినట్లు టాక్.

కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ ‘డియర్ కామ్రేడ్‌’లో నటించాడు. సామాజిక కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవల పూర్తి అవ్వగా.. ఫైనల్ కాపీని చూసిన విజయ్ కొన్ని సన్నివేశాలపై అసంతృప్తిని వ్యక్తం చేశాడట. దీంతో ఆ సన్నివేశాలను రీ షూట్ చేసిన తరువాతే విడుదల తేదిని లాక్ చేయమని దర్శకనిర్మాతలకు తెలిపినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక నటించగా.. మేలో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

Published On - 5:29 pm, Tue, 12 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu