‘మహానాయకుడు’ రాకకు ముహూర్తం ఫిక్స్

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం ‘మహానాయకుడు’ రాకకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 22న ‘మహానాయకుడు’ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. దీంతో చిత్ర విడుదలపై ఇన్ని రోజులుగా వస్తోన్న ఊహాగానాలకు తెరపడినట్లు అయ్యింది. అయితే రెండు భాగాలుగా ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కించగా.. మొదటి భాగం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో […]

‘మహానాయకుడు’ రాకకు ముహూర్తం ఫిక్స్

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం ‘మహానాయకుడు’ రాకకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 22న ‘మహానాయకుడు’ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. దీంతో చిత్ర విడుదలపై ఇన్ని రోజులుగా వస్తోన్న ఊహాగానాలకు తెరపడినట్లు అయ్యింది.

అయితే రెండు భాగాలుగా ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కించగా.. మొదటి భాగం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో రెండో భాగంపై కసరత్తులు చేసిన దర్శకుడు క్రిష్.. కొన్ని మార్పులు చేర్పులు చేశాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం షూటింగ్ పూర్తి అవ్వగా.. తాజాగా విడుదల తేదిని ఖరారు చేశారు. అలాగే ఈ నెల 16న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరపబోతున్నట్లు కూడా మూవీ యూనిట్ ప్రకటించింది. ఇక ఈ భాగంపై నందమూరి అభిమానులు చాలా అంచనాలే పెట్టుకున్నారు.

Published On - 6:02 pm, Tue, 12 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu