Vijay Devarakonda: బర్త్‌డే రోజు ఎమోషనల్‌ అయిన విజయ్‌ దేవరకొండ.. సోషల్‌ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్‌..

Vijay Devarakonda: టాలీవుడ్‌ యంగ్‌, ట్యాలెంటెడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత వివరాలతో పాటు, సినిమా విశేషాలను పంచుకుంటూ..

Vijay Devarakonda: బర్త్‌డే రోజు ఎమోషనల్‌ అయిన విజయ్‌ దేవరకొండ.. సోషల్‌ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: May 10, 2022 | 6:32 PM

Vijay Devarakonda: టాలీవుడ్‌ యంగ్‌, ట్యాలెంటెడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత వివరాలతో పాటు, సినిమా విశేషాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విజయ్‌ తన పుట్టిన రోజు సందర్భంగా చేసిన ఓ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో బిజీగా ఉన్న విజయ్‌ దేవరకొండ, బర్త్‌డే వేడుకలను అదే సినిమా సెట్స్‌లో కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు.

ఈ నేపథ్యంలోనే తన తల్లిని హత్తుకున్న ఫొటోను షేర్‌ చేసిన విజయ్‌ ‘నాకు 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడం మానేసిన ఓ వ్యక్తికి, మీ ప్రేమ నన్ను వారి గురించి ఆలోచించేలా చేసింది. ఎమిదేళ్ల క్రితం, నాపేరు, నా ఉనికి మీకు తెలియదు. నన్ను మీరంతా ఈరోజు ఉత్సాహపరుస్తున్నారు. నాకు మద్ధతుగా నిలుస్తున్నారు. నన్ను నమ్ముతున్నారు. ఎలాంటి షరతులు లేని ప్రేమను పంచుతున్నారు. నేను ఈ ప్రేమను తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఏదో ఒక రకంగా మీ నుంచి నేను పొందిన ప్రేమను మీకూ ఇస్తాను. ఆరోగ్యంగా, సంతోషంగా ఉండండి’ అంటూ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

తనను ఇంత వారిని చేసిన అభిమానులపై విజయ్‌ చూపించిన ప్రేమకు ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. విజయ్‌ ఎంతో ఎమోషన్‌తో చేసిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున లైక్స్‌ కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం లైగర్‌ సినిమాను పూర్తి చేసిన విజయ్‌, శివనిర్వాణతో ఒక సినిమా, జన గణలో నటిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు